వెన్నెల కిషోర్ (Vennela Kishore) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అలా మొదలైంది (Alamodalaindi) కార్యక్రమానికి ప్రతివారం ఒక సెలబ్రెటీ కపుల్ హాజరవుతూ వారి గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నారు.ఈక్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరై వారి వృత్తిపరమైన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.
అయితే తాజాగా ఈ కార్యక్రమానికి డైరెక్టర్ చందు మొండేటి(Chandu Mondeti) తన భార్య సుజాత(Sujatha)తో కలిసి హాజరయ్యారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా చందు మొండేటికి తన భార్య సుజాత ఎలా పరిచయమైంది వారి ప్రేమ ఎలా కొనసాగిందనే విషయాలన్నింటి గురించి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.చందూ మొండేటి ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్లాక్ అండ్ మధ్యలో కలర్‌ఫుల్‌గా ఈ అమ్మాయి కనిపించే సరికి అలా చూస్తూ ఉండిపోయానని తన లవ్ స్టోరీ గురించి చెబుతూ ఉండగా దీనికి చాలా మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని వెన్నెల కిశోర్ చెప్పడంతో వెంటనే సుజాత తనకు ఇమ్మెచ్యూరేమో, నాకు మెచ్యూరే అని సుజాత నవ్వులు పూయించారు.
ఇక ఈ ప్రోమోలో వారిద్దరి మధ్య జరిగినటువంటి చిన్న చిన్న తగాదాలు గురించి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది.ఇక మేమిద్దరం ప్రేమలో పడిన తర్వాత తరచూ ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారని ఇలా ఫోన్లో మాట్లాడటం చూసి మరో ఆరు నెలల్లో మేము పెళ్లి చేసుకుంటామని అందరూ భావించారని చందు తెలియజేశారు.ఇంట్లో అందరూ చందుని ఏమని పిలుస్తారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సుజాత సమాధానం చెబుతూ హడావుడి కేంద్రం అని పిలుస్తారు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా నవ్వులు విరబుసాయి.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.