వృద్ధురాలి పట్ల పెద్ద మనసు చాటుకున్న మాజీ మంత్రి పేర్ని నాని..

కృష్ణాజిల్లా,మచిలీపట్నం: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఓ వృద్ధురాలి పట్ల పెద్ద మనసు ప్రదర్శించారు.మచిలీపట్నంలో కాళ్లకు చెప్పులు లేకుండా నడి ఎండలో నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలిని చూసి ఆయన చలించిపోయారు.

 Perni Nani Shows Humanity Buys New Slippers For An Old Woman, Perni Nani , New S-TeluguStop.com

ఆమెకు చెప్పులు కొనిచ్చి మానవత్వం చాటుకున్నారు.

ఆ సమయంలో పేర్ని నాని కారులో అటుగా వెళుతున్నారు.

ఎండదెబ్బకు జన సంచారం ఎక్కువగా లేని ఆ సమయంలో, వృద్ధురాలు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడస్తుండడం పట్ల ఆయన దృష్టిని ఆకర్షించింది.వెంటనే కారు ఆపి, ఆ వృద్ధురాలి వివరాలు కనుకున్నారు.

ఆమె పేదరాలు అని గ్రహించిన పేర్ని నాని, ఆమెను ఓ పాదరక్షల షోరూంకు తీసుకెళ్లి, నచ్చిన చెప్పులు కొనిచ్చారు.

చెప్పులు ఎలా ఉన్నాయమ్మా… లూజుగా ఉన్నాయా… సరిపోయాయా అంటూ అడిగి తెలుసుకున్నారు.

చెప్పులు కొనిచ్చిన పేర్ని నానికి ఆ వృద్ధురాలు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube