ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయాలి....

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాదనోద్యమంలో క్రియాశీలపాత్ర పోషించిన దళితులను టిఆర్ఎస్ పార్టీ అధికారం లోకి రాగానే విస్మరించినారు,తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తా అని చెప్పిన పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చివరికి అధికారం లోకి రాగానే దళితులను మోసం చేసి తానే ముఖ్యమంత్రి అయ్యాడు,భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఓట్లు దండుకొని రెండవసారి అధికారం లోకి వచ్చిన దళితుల పట్ల కపటప్రేమ చూపిస్తూ కేవలం ఓటు బ్యాంక్ మాత్రంగానే ఉపయోగించుకుంటూ మోసం చేస్తున్నారు,

 Dalit Bandhu Should Be Implemented For Every Dalit Family, Dalit Bandhu , Dalit-TeluguStop.com

ముఖ్యమంత్రి కెసిఆర్ హుజురాబాద్ నియోజకవర్గం లో ఉపఎన్నికల ముందు ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం పేరిట 10 లక్షలు ఇస్తా అని హామీ ఇచ్చి కేవలం హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత కుటుంబాలకు ఎలక్షన్ కి ముందు ఓట్ల కోసం దళిత బంధు అమలుచేసి అక్కడక్కడా నామమాత్రంగా పంపిణి చేసి మళ్ళీ మోసం చేశారు కెసిఆర్ ,తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికలకు ముందు, దళితులకు హామీలు ఇచ్చుకుంటూ పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రతి సారి మోసం వాక్సినేషన్ ,ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ధశాబ్దం అయిన నేటికీ కెసిఆర్ పాలనలో దళితులు అభివృద్ధికి నోచుకోపోవడం చాలా బాధాకరం,దళిత ఎమ్మెల్యే లు ఎస్సీ రిజర్వేషన్ లో పదవులు పొందుతూ కోట్ల రూపాయలు, ఆస్తులు, భూములు అక్రమంగా సంపాదించుకొని రాజబోగాలు అనుభవిస్తున్నారు

కానీ దళితుల సమస్యలు విస్మరిస్తూ దళిత జాతికి ద్రోహం చేస్తున్నారు .

దళిత బందు పథకం పేరిట దళిత ప్రజలను మభ్యపెట్టి రానున్న ఎన్నికల్లో ఓట్లు దండుకొని మళ్ళీ మూడవసారి అధికారం లోకి వచ్చి దళితులను మోసం చేయాలనీ చూస్తున్నారు దళిత ఎమ్మెల్యే లు అసెంబ్లీ సమావేశంలో చర్చించి రానున్న అసెంబ్లీ ఎన్నికల లోపు ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేయడానికి కృషి చేయాలనీ డిమాండ్ చేస్తూ.లేనియెడల బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లకు, నాయకులకు,తగిన గుణపాఠం చెప్పడానికి దళిత మేధావులను , నాయకులను, అంబేద్కర్ వారసులను ఏకం చేసి దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామనీ హెచ్చరించారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube