కాంగ్రెస్ నేతలు ఎన్ని పగటి కలలు కన్నా ఆ పార్టీకి 20 సీట్లు మించి రావని జోస్యం చెప్పారు తెలంగాణ తాత్కాలిక ముఖ్యమంత్రి కేసీఆర్.( KCR ) ఖమ్మం జిల్లా మదిర లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
బట్టి విక్రమార్కని( Bhatti Vikramarka ) గతఎన్నికలలో మీరు గెలిపిస్తే ఆయన ఈ ప్రాంతానికి చేసింది ఏమిటని ఆయన ప్రజలను ప్రశ్నించారు.హైదరాబాదులో పోలీసులకు దొరుకుతున్న కట్టలన్నీ కాంగ్రెస్( Congress ) ఆసాములవే అని, నోట్లు కుమ్మరిస్తున్న కాంగ్రెస్ ఆసాములకు కోట్ల విలువైన మీ ఓట్లతో బుద్ధి చెప్పాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.నిబందనలు పాటించలేదనే కారణంతోనే తెలంగాణకు తక్కువ నిధులు మంజూరు చేసినట్లుగా ఆర్థిక మంత్రి సీతారామన్ చెబుతున్నారని

తాను బ్రతికుండగా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనని ఆయన చెప్పుకొచ్చారు.ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇక్కడి ఎమ్మెల్యే బోడెపూడి వెంకటేశ్వర్లు ఎండిపోయిన వరి కంకులతో అసెంబ్లీలో ఆందోళన చేసేవారని, కరెంటు బుడ్లు , మొక్కజొన్న కంకులతో ధర్నాలు చేసేవారని, ఇప్పుడు ఖమ్మం జిల్లా లో (
Khammam ) ఆ పరిస్థితులు లేవని ఇక్కడ పూర్తిస్థాయిలో కరెంటు ని , సాగునీటిని అందించడం వల్ల రైతుల సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నారని ఈ ప్రాంతం పై వివక్ష చూపలేదని ఇక్కడ రెండుసార్లు బిఆర్ఎస్ను గెలిపించక పోయినా కూడా అభివృద్ధి చేశామని,

దళిత బంధు( Dalita Bandhu ) కావాలని బట్టి విక్రమార్క తనను అడగలేదన్నారు .పైలెట్ ప్రాజెక్టుగా చింతకాని ని ఎన్నుకున్నా ఇక్కడి నుంచి ఎవరు అప్లై చేయలేదన్నారు.మదిర నుంచి 3400 కుటుంబాలకు 10 లక్షల చొప్పున సహాయం అందించామని ఒకే టర్మ్ లో కాకపోయినా పూర్తిస్థాయిలో దళితుల్లో పేదరికం అంతం చేయాలన్నదే తన ధ్యేయం అన్నారు కేసీఆర్. తెలంగాణలోని ప్రతి అంగుళం కేసీఆర్ దేనిని ప్రతి అంగుళాన్ని అభివృద్ధి చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.