తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) విదేశీ పర్యటన ఖరారు అయింది.జనవరి 15వ తారీఖు నుంచి 20వ తారీకు వరకు విదేశాలలో పర్యటించనున్నారు.
దావోస్ లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు అయింది.దావోస్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు( World Economic Forum )లో పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డికి ఇది తొలిసారి విదేశీ పర్యటన.ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పలువురు ఉన్నతాధికారులు వెళ్ళనున్నారు.
దావోస్ సదస్సులో భాగంగా ప్రముఖ గ్లోబల్ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు.
ప్రపంచ ఆర్థిక సదస్సులో పలు దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు.ఈసారి ఐదు రోజులపాటు వరల ఎకనామిక్ ఫారం సమావేశాలు జరగనున్నాయి.ఈ సదస్సుకి మన దేశంలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు మరియు అధికారులు కూడా పాల్గొంటారు.గతంలో దావోస్( Davos ) లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan ) పాల్గొన్నారు.
అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ కూడా పాల్గొనడం జరిగింది.కాగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో జనవరి మూడో వారంలో జరగబోయే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనటానికి రెడీ కావడం జరిగింది.