ఆచార్యలో ఆ హీరోనే డామినేట్ చేశారా.. అతని పాత్రే హైలెట్ అయ్యిందంటూ?

భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కి థియేటర్లలో రిలీజైన ఆచార్యకు మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది.ఆచార్యలో చిరంజీవిని చరణ్ డామినేట్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Charan Domination In Acharya Movie Details, Ram Charan, Megastar Chiranjeevi, Ra-TeluguStop.com

ఆచార్య మూవీ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉన్నా సాధారణ ఆడియన్స్ కు మాత్రం నచ్చడం కష్టమేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఆచార్య తొలిరోజు ఆక్యుపెన్సీ 60 శాతానికి అటూఇటుగా ఉందని తెలుస్తోంది.

ఆచార్య మూవీ తొలిరోజు కలెక్షన్లు 28 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండవచ్చని సమాచారం అందుతోంది.క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వస్తుండటంతో నెగిటివ్ రివ్యూలు సైతం ఆచార్య కలెక్షన్లపై కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఆచార్య కథ, కథనంలో చేసిన మార్పులే ఈ సినిమా ఫ్లాప్ కు కారణమని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆచార్య హవా మూడు రోజులకే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Telugu Acharya, Achrya Day, Koratala Shiva, Pooja Hegde, Chiranjeevi, Ram Charan

మెగాస్టార్ చిరంజీవి వయస్సుకు తగిన పాత్రనే ఎంచుకున్నా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా తమకు నచ్చలేదని చెబుతున్నారు.ఫస్టాప్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఏ మాత్రం లేదని వాళ్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొరటాల శివ ఆచార్య కోసం నాలుగేళ్ల సమయం కేటాయించినా తనకు వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.

Telugu Acharya, Achrya Day, Koratala Shiva, Pooja Hegde, Chiranjeevi, Ram Charan

ఆచార్య తొలిరోజు కలెక్షన్లను బట్టి ఈ సినిమా తుది ఫలితం గురించి అంచనాలకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.కొరటాల శివకు భవిష్యత్తు ఆఫర్ల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆచార్య భారీ రికార్డులను సాధించాలని అభిమానులు సైతం భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అలా జరగడం కష్టమేనని తెలుస్తోంది.140 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube