Chandrababu Naidu : జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి( NDA Alliance ) మద్దతు తెలుపుతున్నట్లు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు అధినేత జయప్రకాష్ నారాయణ( Jayaprakash Narayana ) తెలియజేశారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ప్రశాంతంగా జరుగుతాయా అని అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు.

 Chandrababu Welcomes Jayaprakash Narayan Decision-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత దిగజారాయని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతుందని అన్నారు.

సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదని పేర్కొన్నారు.అభివృద్ధి చేస్తేనే మంచి పాలన ఇచ్చినట్లు అవుతుందని చెప్పుకొచ్చారు.

అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయడం సరికాదు.సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలు, అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించటం అంటూ వివరించారు.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా అనే సందేహం ఉందన్నారు.నిర్బయంగా నమ్మిన వారికి ఓటు వేయాలని ప్రజలను ఆయన సూచించారు.సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధి చూసి ఓటు వేయాలని కోరారు.ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి సమతూకం పాటించాలన్నారు.ఏపీలో ప్రస్తుత పరిస్థితులు బట్టి తాను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.జయప్రకాష్ నారాయణ ప్రకటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) స్పందించారు.“టీడీపీ – బీజేపీ – జనసేన” కూటమికి( TDP BJP Janasena Alliance ) సపోర్ట్ చేస్తున్నట్లు జయప్రకాశ్ నారాయణ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.రాష్ట్రంలో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ, ప్రతి సంస్థ ముందుకు రావాలి అని ట్విట్టర్ లో చంద్రబాబు పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube