శారీరక, మానసిక ఒత్తిడి అధిగమించడంపై అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థులు శారీరక, మానసిక ఒత్తిడి అధిగమించడంపై కిరణం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ నయీమ్ జహా బుధవారం అవగాహన కల్పించారు.

తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి బాలికల స్కూల్, జూనియర్ కళాశాలలో కిరణం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌమార దశలో శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులు, వాటి వల్ల కలిగే ప్రభావాలు ,వాటి నుంచి అధిగమించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిశుభ్రత పై వివరించారు.

ఆ వయసులో కలిగే మానసిక ఆందోళనలు, నిరాశ నిస్పృహ, పరీక్షల భయం, ఏకాగ్రత లేకపోవడం, శారీరక మానసిక ఒత్తిడి నీ అధిగమించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కౌన్సిలింగ్ ఇచ్చారు.విద్యార్థులకు ఫోన్ లో సహాయం అందించేందుకు కిరణం టోల్ ఫ్రీ నెంబర్ 18004253333 ని ఏర్పాటు చేశారని వెల్లడించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పద్మజ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మోడీని కలవడం ఆనందంగా ఉంది - కోనేటి సాయిలు
Advertisement

Latest Rajanna Sircilla News