అనకాపల్లి( Anakapalle ) జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకం( YSR Cheyutha scheme ) నాలుగో విడత నిధులను విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 26 లక్షల 98 వేల 931 మందికి లబ్ధి చేకూరిందని సీఎం జగన్( CM Jagan ) తెలిపారు.ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ మహిళలతో పాటు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఆర్థికసాయం చేశామన్నారు.
ఏటా రూ.18 వేల 750 చొప్పున వరుసగా నాలుగేళ్లలో ఒక్కొక్కరికి రూ.75 వేలు ఆర్థిక సాయం చేశామన్నారు.అదేవిధంగా ఏపీలో పొదుపు సంఘాలు 99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు.ఇల్లు లేని పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని పేర్కొన్నారు.
సుమారు 22 లక్షల ఇళ్లు నిర్మించామన్న సీఎం జగన్ చంద్రబాబు( Chandrababu ) హయాంలో ఒక్కరికి కూడా సెంటు భూమి ఇవ్వలేదని విమర్శించారు.