కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు మరోసారి యాక్టీవ్ అవుతున్నాయి.సర్రేలో ఇటీవల భారత హైకమీషనర్ పాల్గొన్న కార్యక్రమానికి అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించిన రోజు తర్వాత ఖలిస్తాన్ గ్రూపులు శనివారం టొరంటో, వాంకోవర్‌లలోని( Toronto , Vancouver ) భారత కాన్సులేట్‌ల ముందు నిరసనలు నిర్వహించాయి.
కానీ ఆందోళనల ప్రభావం అంతగా కనిపించలేదు.గతేడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్యకు నిరసనగా ప్రతి నగరంలో ఖలిస్తాన్ కార్ ర్యాలీకి పిలుపునిచ్చారు.
నిజ్జర్‌ను భారత్‌లో ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ వీకెండ్‌లో రెండు కాన్సులేట్‌లు మూసివేయబడినందున కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం లేదు.
రెండు నగరాల్లో కాన్సులేట్‌లు వున్న భవనాల దగ్గరికి నిరసనకారులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.బారికేడ్లు వేసి ఆందోళనకారులను నిలువరించారు.బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో( British Columbia ) నిజ్జర్ ప్రధాన నిర్వాహకుడిగా వున్న వేర్పాటువాద సమూహం సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) ఈ నిరసనలకు ప్రాతినిధ్యం వహించింది.నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ నిరసనలు నిర్వహించారు.
ఒట్టావాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Verma ) శుక్రవారం సాయంత్రం బ్రిటీష్ కొలంబియాలోని స్థానిక వాణిజ్య బోర్డుతో ‘‘ India and Canada: The Future of our Global Economy Together ’’ పేరిట నిర్వహించిన సమావేశాన్ని నిరసిస్తూ ఆ వేదికను ఖలిస్తాన్ అనుకూల శక్తులు చుట్టుముట్టాయి.గతేడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియా పట్టణంలో ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత సర్రేకు భారత హైకమీషనర్ రావడం ఇదే తొలిసారి.నిరసనకారుల ఆందోళనలను లెక్కచేయకుండా ఆయన ఈ సమావేశాన్ని కొనసాగించారు .అనంతరం ఈ ఈవెంట్ విజయవంతమైనట్లుగా సంజయ్ వెల్లడించారు.
అయితే సమావేశం సందర్భంగా ఖలిస్తాన్ మద్ధతుదారులు దౌత్య సిబ్బందిని దుర్భాషలాడటంతో పాటు తిరాంగాను అగౌరవపరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని సర్రే బోర్డ్ ఆఫ్ ట్రేడ్ (ఎస్‌బీవోటీ), సౌత్ ఏషియన్ బిజినెస్ అసోసియేషన్ (ఎస్ఏబీఏ) సంయుక్తంగా నిర్వహించాయి.షెరటాన్ గిల్డ్ ఫోర్డ్ హోటల్ ఆహ్వానం, గుర్తింపు లేకుండా ఎవరూ లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో లాక్ చేశారు.ఈవెంట్ ప్రారంభం కావడానికి అరగంటల ముందు దాదాపు 500 మంది నిరసనకారులు హోటల్ వెలుపల గుమిగూడి చుట్టుముట్టి, ప్రవేశాలను అడ్డుకున్నారు.
భారతీయ నిఘా వర్గాల నుంచి తప్పించుకునేందుకు వారు ముసుగులు ధరించి, ఖలిస్తాన్ జెండాలు చేతపట్టుకుని వేర్పాటువాద నినాదాలు చేశారు.