ఆ ప్రొడక్ట్స్ అన్నీ సగం ధరకే కొనచ్చు... ఎలానో తెలుసా?

సాధారణంగా పండుగ సీజన్ మొదలవగానే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలన్నీ ఎంతో ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించి, కస్టమర్లను ఆకర్షిస్తుంది.నిత్యావసర సరుకుల నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ప్రతి ఒక్క వస్తువుపై ప్రత్యేకమైన ఆఫర్ ఉంచి కస్టమర్లను ఆకర్షిస్తుంటారు.

 Air Conditioner, Refrigerator, Fridge,50 Percent Discounts,amazon, Amazon Great-TeluguStop.com

ఇప్పటికే దసరా ఫెస్టివల్ ఆఫర్లతో తమదైన శైలిలో కస్టమర్లను ఆకర్షించాయి.అయితే ప్రస్తుతం దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయినా అమెజాన్ ఈ వస్తువు కొనుగోలు పై దాదాపు 50 శాతం డిస్కౌంట్లను ప్రకటించింది.

దీపావళి సందర్భంగా అమెజాన్ వాషింగ్ మిషన్, ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్ వంటి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ పై దాదాపు 55 శాతం భారీ డిస్కౌంట్ ప్రకటించింది.ఇవే కాకుండా పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ పై అమెజాన్ ఆకర్షణీయమైన ఆఫర్లను కస్టమర్లకు కల్పించింది.

ఇంత మంచి ఆఫర్ లలో మీరు ఏదైనా కొనాలనుకుంటే ఇదే తగిన సమయం.అమెజాన్ ఏ వస్తువు పై ఎంత వరకు డిస్కౌంట్ కల్పించి ధరలను నిర్ణయించి ఉందో ఇక్కడ తెలుసుకోవచ్చు.

హయర్ కంపెనీకి చెందిన సైడ్ బై సైడ్ ఫ్రిజ్ అసలు ధర దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుంది.కానీ ప్రస్తుతం అమెజాన్ ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్లు ఈ ఫ్రిడ్జ్ ను కేవలం 52 వేల రూపాయలకు అందుబాటులో ఉంచింది.అలాగే బేసిక్స్ ఫ్రోస్ట్ ఫ్రీ అండ్ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ ధర రూ.40,999 అసలు ధర కాగా ప్రస్తుతం అమెజాన్ ఈ రిఫ్రిజిరేటర్ పై దాదాపు ఆరు వేల రూపాయలను తగ్గించి కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.ఇవే కాకుండా సాంసంగ్,ఎల్జి ఫ్రిడ్జ్ లపై భారీ తగ్గింపు ప్రకటించింది.

ఇక ఏసీల విషయానికి వస్తే పానాసోనిక్ 1.5 టన్ను ఏసీపై రూ.14,500 వరకు తగ్గింపు పొందవచ్చు.ఇదే కంపెనీకి చెందిన ఇన్వర్టర్ ఏసీ లపై అమెజాన్ లో దాదాపు 22 వేల రూపాయలు వరకు డిస్కౌంట్ లభిస్తుంది.సాంసంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ పై అమెజాన్5,900 రూపాయలను తగ్గించి ఈ వాషింగ్ మిషన్ ను కేవలం 20,990 లకే అమెజాన్ లో పొందవచ్చు.

ఇంత అద్భుతమైన ఆఫర్లను ప్రకటించిన అమెజాన్,ఏవైనా కొనాలనుకునే కస్టమర్లకు ఇదే మంచి అవకాశమని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube