బుగ్గ‌న గారి డబ్బుల‌ లెక్క‌లు చూస్తే ఆంధ్రుల‌కు దిమ్మ తిరిగిపోతుంది..!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరిస్తూ ఈ మధ్య నేషనల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు ఆర్థికశాఖే అధికారికంగా ఆందోళన కలిగించే లెక్కలను ప్రజల ముందు పెట్టింది.

 Buggana Rajendranath Ap Budjet Deatails-TeluguStop.com

పేరు గొప్ప.ఊరు దిబ్బ అన్నట్లుగా రాష్ట్ర బడ్జెట్‌ను 2.31 లక్షల కోట్లుగా ప్రకటించారు.కానీ తీరా చూస్తే ఇప్పుడు అందులో ఏకంగా రూ.94 వేల కోట్ల లోటు కనిపిస్తోంది.

Telugu Ap Cm Jagan, Ap Finnance, Jaganspend, Ycpcm-

ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో ఇంత భారీ లోటు పూడ్చడం అసాధ్యం.జగన్‌ తన నవరత్నాల అమలు కోసం భారీగా డబ్బులు పంచి పెడుతున్నారు తప్ప కొత్తగా ఆదాయాన్ని సృష్టించేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు.దీంతో లోటు అలా పెరిగిపోతూనే ఉంది.

కనీసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా రాబట్టలేకపోతున్నారు.

కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసి.

వాటికి యూసీలు ఇస్తే కొత్తగా మళ్లీ నిధులు ఇస్తారు.కానీ ఏపీ ఆర్థికశాఖ అధికారులు ఆ పని కూడా చేయలేకపోతున్నారు.బడ్జెట్‌లో కేంద్రం నుంచి రూ.32 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు.కానీ ఇప్పుడు మాత్రం ఆ మొత్తాన్ని రూ.14235 కోట్లకు కుదించారు.దీంతో కేంద్ర నిధుల్లోనే సుమారు రూ.17 వేల కోట్లకుపైగా లోటు కనిపిస్తోంది.

Telugu Ap Cm Jagan, Ap Finnance, Jaganspend, Ycpcm-

గ్రాంట్ల రూపంలో రూ.61 వేల కోట్ల వరకూ వస్తాయన్న బడ్జెట్‌ అంచనాలను అధికారులు ఇప్పుడు సవరించారు.ఇప్పుడు ఏకంగా రూ.34 వేల కోట్ల మేర తగ్గించి రూ.17665 కోట్లే వస్తాయంటున్నారు.సొంత పన్నుల ఆదాయం రూ.82 వేల కోట్లకుపైగానే ఉంటుందని చెప్పినా.అది కూడా రూ.64 వేల కోట్లకు మించదని ఇప్పుడు చెబుతున్నారు.

పన్నేతర ఆదాయంలోనూ రూ.3 వేల కోట్లకుపైగానే లోటు కనిపిస్తోంది.అసలు బడ్జెట్‌లో మొత్తం ఆదాయాన్ని రూ.2.25 లక్షల కోట్లుగా చూపించినా.ఇవన్నీ చూస్తుంటే అది రూ.1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ వచ్చేలా కనిపించడం లేదు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి జరిపిన సమీక్షలో అధికారులు సమర్పించిన ఈ లెక్కలు షాక్‌కు గురి చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube