ట్రంప్ వాదన గెలుస్తుందా...గెలుపుపై ఎందుకా ధీమా..??

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నువ్వా నేనా అనేట్టుగా భీకర పోరుతో సాగుతున్నాయి.ఎర్లీ ఓటింగ్ ద్వారా సుమారు 8 కోట్ల మంది అమెరికన్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 Donald Trump Confidence On America Elections, Donald Trump, America Elections, U-TeluguStop.com

విజయావకాశాలపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నా విజయం ఎవరిని వరిస్తుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే కొనసాగుతోంది.ఇక ఈ ఎన్నికల్లో గెలుపు రిపబ్లికన్ పార్టీదే నని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఘన విజయాన్ని రిపబ్లికన్ పార్టీ సాధిస్తుందని అంటున్నారు ట్రంప్ అందుకు కొన్ని కారణాలు కూడా వెల్లడిస్తున్నారు.ఇంతకీ ట్రంప్ కు తన గెలుపుపై ఎందుకంత ధీమా, ఏ కారణాలు ఆయన గెలుపుకు దోహద పడనున్నాయి, తన విజయానికి కారణం అనుకుంటున్న అంశాలు ఏమిటి అనేది ఓ సారి పరిశీలిద్దాం.

గత ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయిన తాను 4 ఏళ్ళ పాటు అమెరికన్స్ అభివృద్ధి కోసం, అమెరికా ఆర్థిక ప్రగతి కోసం చేయని సాహసాలు లేవని, ఎన్నో అద్భుతమైన విజయాలు తాను సాధించగలిగానని ట్రంప్ తెలిపారు.గత ఎన్నికల్లో వచ్చిన గెలుపు మార్జిన్ కంటే కూడా ఈ ఎన్నికల్లో వచ్చే మార్జిన్ ఓట్లు అత్యధికంగా తనకు దక్కనున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

అమెరికాను అగ్ర స్థానంలో నిలబెట్టడంలో నిరంతరం కృషి చేశానని తెలిపారు.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చానని, సరిహద్దుల్లో కంచె మొదలు స్థానిక అమెరికన్స్ కే ఉద్యోగాలు అన్న హామీను కూడా అమలు చేశానని తెలిపారు.

ఇదిలాఉంటే పనిలో పనిగా బిడెన్ పై ట్రంప్ విరుచుకుపడ్డారు.


బిడెన్ లాంటి వాడు అధ్యక్షుడిగా ఎన్నికైతే మాత్రం అగ్ర రాజ్య హోదాని మనం వదులుకోవాల్సి వస్తుందని అన్నారు.

అమెరికాకు బిడెన్ ఏ మాత్రం తగిన వాడు కాదని, ఆయన ఉపాధ్యక్షుడిగా పాలన చేసిన సమయంలో ఎన్నో అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారని, చైనా మనకు ఘోరమైన విషాదాన్ని కరోనా ద్వారా మిగిల్చితే బిడెన్ చైనా విషయంలో సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.ఎట్టిపరిస్థితుల్లోనూ బిడెన్ కు ఓటు వెయకూడదని ట్రంప్ అమెరికన్స్ కు పులుపునిచ్చారు.

ఇదిలాఉంటే ట్రంప్ కు గెలుపుపై అంత ధీమా రావడానికి ఆయన దూకుడు స్వభావం, అమెరికా కోసం ఎలాంటి సాహసం అయినా ట్రంప్ చేస్తారనే నమ్మకం, సరిహద్దులల్లో నిర్మిచ తలపెట్టన గోడ, అమెరికన్స్ కే స్థానిక ఉద్యోగాల అమలు ఇవన్నీ కొలిసోచ్చే అంశాలేనని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube