తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ళ రగడ దేశ వ్యాప్తంగా ఎంతగా చర్చకు దారి తీసిందనేది మనం ప్రత్యేకంగా చెప్పుకొనక్కరలేదు.అయితే కేంద్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం ఖరఖండీగా చెప్తూ ఉండటం కానీ కల్లాల వద్ద రైతు నెలరోజుల పాటు తన ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారని వేచి చూడటం కొంత మంది ప్రాణాలే పోవటం ఆత్మహత్యలకు పాల్పడటం లాంటి ఘటనలు జరుగుతున్నాయి.
తెలంగాణలో నీటి లభ్యత ఎక్కువగా ఉన్న కారణంగా వరి పంటను రైతులు ఎక్కువగా సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది.
అంతేకాక గత కొన్నేళ్లుగా వరి పంటకు తమ భూములు అనువుగా మారాయని ఇప్పటికిప్పుడు వేరే పంటల వైపు రైతులు మారాలంటే చాలా కష్టమైన పని అని రైతులు అంతర్గతంగా వెల్లడిస్తున్న అభిప్రాయం.
ఒకవేళ రైతుల ధాన్యాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటే ప్రభుత్వానికి ఋణ భారం అనేది తప్పదు.అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఋణ భారాన్ని భరించే పరిస్థితి లేదు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది.ఇంత వరకు బాగానే ఉన్నా రైతుల గోడును పట్టించుకునే వారు లేక రైతుల భవిష్యత్తు అంధకారంగా మారిన పరిస్థితి ఉంది.అయితే ఈ సమస్యకు ముగింపు ఎక్కడ అనే చర్చ ఇప్పుడు సామాన్య ప్రజల్లో నెలకొంది.ఇది ఇలానే ఉంటుందా లేక రాజకీయ లబ్ధి కొరకు వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఈ రగడ అనేది కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది.
రైతు సమస్యను ఎంత వేగంగా ప్రభుత్వాలు పరిష్కరిస్తే అంత మంచిదని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.