తెలంగాణలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) చెప్పారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్( Congress ) నేతలు అన్నారన్న ఆయన దాన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకున్నారని విమర్శించారు.
అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పిందన్నారు.ఈ క్రమంలోనే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.