ఈటల రాజేందర్ ( Etela Rajender ) తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడు.హుజురాబాద్ అంటే ఈటల.
ఈటల అంటే హుజురాబాద్ అనే విధంగా తయారయ్యాడు.అలాంటి ఈటల ఈటా ఈసారి గురి తప్పింది.
తాను ఒక్కటి తెలిస్తే దైవము ఒకటి తలచినట్టు తను అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాక ఇరకాటంలో పడ్డారు.ప్రస్తుతం ఏం చేయాలో తెలియక అనేక ఆపసోపాలు పడుతున్నారని తెలుస్తోంది.
అలాంటి ఈటల రాజేందర్ రాజకీయ జీవితం, ముందు ముందు ఎదురుకోబోయే పరిస్థితుల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం.ఈటల రాజేందర్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.కేసీఆర్( KCR ) నేతృత్వంలో మంత్రిగా కూడా జనాలకు ఎంతో సేవలందించారు.
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ ( Huzurabad ) నుంచి నాలుగు సాధారణ ఎన్నికల్లో, మూడు ఉప ఎన్నికల్లో విజయం సాధించి తనకు పోటీ ఎవరూ లేరని అనుకున్నారు.అలాంటి ఈటల రాజేందర్ కు బీఆర్ఎస్ లో కాస్త ఇబ్బందులు ఎదురవడంతో ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేసారు.కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపిలో చేరారు.
అయితే ఆయన బీఆర్ఎస్ ను వీడిన సమయంలో టిపిసిసి రేవంత్ రెడ్డి కూడా పార్టీలోకి రమ్మని ఆహ్వానించారట.అయినా పట్టించుకోని ఈటల రాజేందర్ బిజెపిలో చేరి ఎటు కానీ లీడర్ లా మిగిలిపోయారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సీఎం కేసీఆర్ ను ఓడించాలని పట్టుదలతో తన సొంత నియోజకవర్గమైనటువంటి హుజురాబాద్ ను నిర్లక్ష్యం చేసి గజ్వేల్ ( Gajwel ) లో ఎక్కువ సమయం గడిపి ఇటు హుజురాబాద్ సీటు పోగొట్టుకున్నారు, అటు గజ్వేల్ లో గెలవలేక పోయారు.ఈ విధంగా రాష్ట్రస్థాయి లీడర్ ఎటుకాని నాయకుడిగా మిగిలిపోయారు.
ఇదే తరుణంలో కొంతమంది రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లి ఉంటే బాగుండేది అని భావిస్తున్నారు.
కానీ ఆ సమయంలో ఆయన కాంగ్రెస్లోకి వెళ్లి ఉంటే కేసిఆర్ తో పడే ఇబ్బందులు మరో విధంగా ఉండేవి.ఇవన్నీ ఆలోచించుకొని బిజెపిలోకి వెళితే ఆ పార్టీలో ఈటల వర్గం, బండి సంజయ్ ( Bandi Sanjay ) వర్గం అనే విధంగా వర్గాలు తయారయ్యాయి.ఇదే తరుణంలో ఆయన ఓటమి ఫాలు అవ్వడంతో పార్టీ కూడా ఈయనను పట్టించుకోవడం లేదన్నట్టు తెలుస్తోంది.
మళ్లీ పార్టీ రాష్ట్రస్థాయి పగ్గాలు బండి సంజయ్ కే ఇస్తారని సాంకేతాలు వినిపిస్తున్నాయి.ఒకవేళ బండి సంజయ్ కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మాత్రం బిజెపి (BJP) లో ఈటల రాజేందర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే బిజెపిలో ఆయనను ఎవరూ పట్టించుకోవడంలేదని, దీంతో ఈటెల ఏం చేయాలో అర్థం కాక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారట.దీన్ని బట్టి చూస్తే ఈటలను పొమ్మనలేక పోగబెడుతున్నారని కొంతమంది భావిస్తున్నారు.