బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టంట్స్ కి బిగ్ బాస్ మరోసారి వార్నింగ్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌజ్ మెట్స్ అందరికి సినిమాల్లో పాత్రలు ఇమిటేట్ చేసి ఎంటర్టైన్మెంట్ చేయాలని అన్నారు.
అయితే దానికి హౌజ్ మెట్స్ రెడీ అయ్యి వారి ప్రయత్నం వారు చేస్తున్నారు.అయితే మధ్యలో రిలాక్స్ అవడం వల్ల బిగ్ బాస్ అందరిని గార్డెన్ ఏరియాకి పిలిపించి మీకు ఆట మీద ఆసక్తి లేకపోతే తక్షణమే హౌజ్ నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చాడు.
అంతేకాదు డిస్నీ హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్ లో ఈ సీజన్ మొత్తం కెప్టెన్సీ టాస్క్ ని క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది.
బిగ్ బాస్ ఇదివరకు ఐదు సీజన్లు పూర్తి కాగా ఇన్ని సీఅజన్లలో ఇలాంటిది జరగలేదు.
ఫస్ట్ టైం సీజన్ మొత్తం కెప్టెన్సీ టాస్క్ లేకుండా బిగ్ బాస్ ఆర్డర్ చేశాడు.అంటే బిగ్ బాస్ కి ఎంత మండి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.3 వ వారం కెప్టెన్సీ టాస్క్ గా ఇచ్చిన హోటల్ టాస్క్ లో కూడా ఇదే రిపీట్ అయ్యింది.మరి కెప్టెన్సీ టాస్క్ అంటే ఈ సీజన్ హౌజ్ మెట్స్ ఎందుకు ఇలా చేస్తున్నారో వారికే తెలియాలి.
ఈసారి వీకెండ్ లో నాగార్జున కూడా వీరికి బాగా క్లోఅస్ పీకే ఛాన్స్ ఉంది.