మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం.ఈయన మెగా హీరోగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.
అయితే ఇటీవలే అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ తన పుట్టిన రోజును జరుపు కున్నారు.ఈ సందర్భంగా మెగా కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖులు కూడా ఈయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఈసారి సాయి ధరమ్ తేజ్ కొద్దిగా భిన్నంగా తన పుట్టిన రోజును జరుపు కున్నారు.ఈయన హైదరాబాద్ లోని ఒక అనాధ ఆశ్రమంలో తన పుట్టిన రోజును పిల్లల మధ్య జరుపుకున్నారు.
దీనికి సంబందించిన ఫోటోలు ప్రెజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇలా సాయి తేజ్ ఈ ఏడాది తన పుట్టిన రోజును బ్యూటిఫుల్ మూమెంట్స్ తో నింపేసు కున్నాడు.

ఇక సాయి తేజ్ సినిమాల విషయానికి వస్తే.ఈయన ఇటీవలే తన కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.SDT15 స్టార్ట్ అయ్యి వేగంగా పూర్తి కూడా చేసుకుంటుంది.థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట.
ఈ సినిమాకు శ్రీ వెంకటేస్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు.

‘SDT15’ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రాబోతున్నాయి.అలాగే వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా చేస్తుండగానే మరొక సినిమాను అనౌన్స్ చేసాడు సాయి తేజ్..
ఇటీవలే సాయి తేజ్ 16వ సినిమాను అఫిషియల్ గా ప్రకటించారు.డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.