విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.విమానాశ్రయం వద్ద మంత్రుల కాన్వాయ్ లపై జనసేన పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడులకు పాల్పడ్డారు.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వారిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.నిందితుడు కాని వ్యక్తి ఎఫ్ఐఆర్ రద్దును ఎలా సవాల్ చేస్తారని ప్రశ్నించింది.
ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.







