ఆడపిల్లల మీద పగబట్టేసిన బిగ్ బాస్..ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయే లేడీ కంటెస్టెంట్ ఆమెనే!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) ఎంత రసవత్తరంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం.ఈ సీజన్ ప్రారంభం అయ్యి ఆరు వారాలు కావొస్తుంది.

 Bigg Boss Who Took Revenge On The Girls She Is The Lady Contestant Who Will Be E-TeluguStop.com

కానీ యాదృచ్చికమో, లేదా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో తెలియదు కానీ, ఇప్పటి వరకు ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్స్ అందరూ ఆడవాళ్లే.కిరణ్ , రాతిక , దామిని , శుభ శ్రీ ( Kiran, Rathika, Damini, Subha Sri )ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి శుభ శెట్టి , అమర్ దీప్, టేస్టీ తేజా, ప్రిన్స్ యావర్, అశ్విని మరియు నాయని పావని నామినేట్ అయ్యారు.వీరిలో ప్రిన్స్ యావర్ అమర్ దీప్ అత్యధిక ఓట్లతో టాప్ 2 స్థానాల్లో ఉన్నారు.

ఎప్పుడో ఎలిమినేట్ అవుతాడు అనుకున్న టేస్టీ తేజా గ్రాఫ్ బాగా పెరగడం తో అతను ఇప్పుడు మూడవ స్థానం లో ఉన్నాడు.

Telugu Ashwini, Bigg Boss, Damini, Kiran, Rathika, Shobha Shetty, Subha Sri-Movi

మిగిలిన కంటెస్టెంట్స్ మొత్తం లేడీస్ అవ్వడం విశేషం.వీరిలో అశ్విని( Ashwini ) కాస్త బెటర్ ఓటింగ్ తో నాల్గవ స్థానం లో ఉండగా, నాయని పావని, పూజా మూర్తి మరియు శోభా శెట్టి ( Shobha Shetty )డేంజర్ జోన్ లో ఉన్నారు.వీళ్ళ ముగ్గురికి వచ్చిన ఓట్ల శాతం దాదాపుగా సరిసమానంగానే ఉంది.

వీరిలో ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడే చెప్పలేకపోతున్నారు విశ్లేషకులు.అనధికారిక పోలింగ్ లో కొన్ని చోట్ల శోభా శెట్టి కి అతి తక్కువ ఓట్లు వచ్చాయి.

కొన్ని చోట్ల నాయని పావని కి తక్కువ ఓట్లు వచ్చాయి.వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం అయితే పక్కా.పూజా మూర్తి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.5 వారాల్లో జరిగినట్టు గానే, ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతుంది.ఇందులో ఎంత మాత్రం నిజం ఉండబోతుందో చూడాలి.

Telugu Ashwini, Bigg Boss, Damini, Kiran, Rathika, Shobha Shetty, Subha Sri-Movi

కిలో వరుసగా ఇంత మంది ఆడ పడుచులు బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )నుండి బయటకి వెళ్లడం ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు.వచ్చే వారం నామినేషన్స్ లో లేడీస్ వస్తే, ఈసారి కూడా ఎలిమినేట్ అయ్యేది వాళ్ళే అని అంటున్నారు.కానీ ఈ వారం సందీప్ నామినేషన్స్ లోకి వచ్చి ఉంటే, అతనికి ఉన్న తీవ్రమైన నెగటివిటీ కి కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవాడని అంటున్నారు.

వచ్చే వారం సందీప్ నామినేషన్స్ లోకి వస్తే కచ్చితంగా ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు.ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube