టాలీవుడ్ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అంత బిజీ గా ఏ హీరో కూడా ఉండదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఒకపక్క క్రియాశీలక రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే మరోపక్క సినిమాల షూటింగ్స్ కూడా విరామం లేకుండా చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం అంతగా బాగుండదు, వాతావరణం మారితే ఆయన శరీరం లో ఎన్నో మార్పులు వస్తాయి.నిన్న మొన్నటి వరకు కృష్ణ జిల్లాలో ‘వారాహి విజయ యాత్ర’ ( Varahi Vijaya Yatra )ని నిర్వహించిన పవన్ కళ్యాణ్ కి అక్కడి వాతావరణం సరిగా సెట్ అవ్వక వైరల్ ఫీవర్ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు.వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే ఆయన మళ్ళీ వారాహి విజయ యాత్ర ని ప్రారంభిస్తారని అనుకున్నారు.
వచ్చే నెలలో తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికలు నువ్వా నేనా అనే రేంజ్ లో జరగబోతున్నాయి.

ఈ ఎన్నికలలో ఆంధ్ర పార్టీలు దూరంగా ఉన్నాయ్ కానీ, జనసేన పార్టీ( Janasena party ) మాత్రం పోటీ చేస్తుంది.పవన్ కళ్యాణ్ కి మొదటి నుండి మంచి పట్టు ఉన్న 30 స్థానాల్లో జనసేన పార్టీ ని పోటీకి దింపుతున్నట్టు ప్రకటించాడు.ఆ 30 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ని కూడా విడుదల చేసాడు.
కానీ ఈ నెల 20 వ తారీఖు నుండి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’( Ustad Bhagat Singh ) చిత్రం కొత్త షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడని టాక్.ఈ షెడ్యూల్ దాదాపుగా 5 రోజుల వరకు ఉంటుంది అట.అనంతరం ఆయన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్ళికి హాజరు అయ్యేందుకు 26 వ తారీఖున స్పెయిన్ కి వెళ్లబోతున్నాడు.ఇలా ఆయన షెడ్యూల్స్ మొత్తం నిర్ణయింపబడింది.
మరి ‘వారాహి విజయ యాత్ర’ మలివిడత ఎప్పుడు ప్రారంభం అవ్వబోతుంది అనే సందిగ్ధం లో పడ్డారు జనసేన నాయకులు.

ఒకవేళ నవంబర్ లో ఆయన ‘వారాహి విజయ యాత్ర’ ప్రారంభిస్తే ఆ నెల మొత్తం తెలంగాణ ప్రాంతం లోనే ఉంటుంది అని సమాచారం.ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి డిసెంబర్ వరకు ‘వారాహి విజయ యాత్ర’ ఉండే అవకాశం లేదని తెలుస్తుంది.ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ మరియు జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత ఇరు పార్టీల క్యాడర్ నుండి వోట్ షేర్ బలంగా జరిగితేనే అధికారం లోకి రావడానికి సాధ్యం అవుతుంది.
కానీ పవన్ కళ్యాణ్ ఊరికే లాంగ్ బ్రేక్స్ ఇవ్వడం, లోకేష్ ‘యువ గళం’ యాత్ర ని నిలిపివేయడం, చంద్రబాబు నాయుడు జైలు లో ఉండడం, ఇలా ఎటు కదలని దిక్కు తోచని స్థితి లో ఉంది కూటమి లో ఉన్న రెండు పార్టీల పరిస్థితి.చూడాలి మరి భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అనేది.