సంతోష్ శోభన్ కి గట్టి పోటి ఇస్తున్న ఆయన తమ్ముడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల్లో సంతోష్ శోభన్( Santosh Shobhan ) ఒకరు.ప్రస్తుతం ఈయన సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు.

 Santosh Shobhan's Younger Brother Is Giving A Hard Time , Santhosh Shobhan, Youn-TeluguStop.com

అయినప్పటికీ ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండటం తో ఆయన క్రేజ్ చాలా వరకు తగ్గింది.ఇక ఇప్పుడు ఆయన తమ్ముడు అయిన సంగీత్ శోభన్( Sangeeth Shobhan ) కూడా మాడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

దాంతో సంతోష్ కి తన ఇంట్లోనే తన తమ్ముడు రూపంలో మరో పోటీ ఎదురవుతుంది కాబట్టి ఆయన ఇప్పుడు చేసే సినిమాలని జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి.

 Santosh Shobhan's Younger Brother Is Giving A Hard Time , Santhosh Shobhan, Youn-TeluguStop.com

లేకపోతే తన తమ్ముడే తనని బీట్ చేసి వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి.అయితే రీసెంట్ గా మాడ్ సినిమాతో సక్సెస్ అందుకున్న సంగీత్ శోభన్ ఈరోజు ప్రేమ విమానం( prema vimanam ) అనే సినిమా పేరుతో ఓటిటిలో ఒక సినిమాను రిలీజ్ చేశాడు.దాంతో ఈ సినిమా మంచి విజయం సాధించే దిశ గా కనిపిస్తుంది.

ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాని చూసి చాలా మంది సినిమా మీద వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడంతో చాలా మంది సినిమాని చూడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.ఇక సంగీత్ శోభన్ కూడా తన తదుపరి సినిమా మీద ఫోకస్ పెట్టినట్లు గా తెలుస్తుంది.

ఇక సంతోష్ శోభన్ మంచి సినిమాలు చేయకపోతే మాత్రం తన తమ్ముడు అయిన సంగీత్ శోభన్ చేతిలో ఓడిపోయిన అన్న గా ఇండస్ట్రీలో మిగిలిపోతాడు అంటూ ఆయన గురించి చాలా మంది మాట్లాడుతున్నారు.ఇక ఇప్పుడు సంతోష్ ఏ సినిమా చేస్తున్నాడు అనే విషయం పెద్దగా జనాలకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఆ సినిమా మీద భారీ అంచనాలు లేకుండా చేసి సైలెంట్ గా వచ్చి మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు.

ఆయన స్ట్రాటజీ ప్రకారం ఇప్పుడు చేసే సినిమా హిట్టు పడుతుందా లేదా అనేది చూడాలి…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube