మన దేశంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరును సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3కు రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచారు.ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఒక జోడీ పాపులారిటీని సంపాదించుకోగా బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి జోడీ ఫేమస్ అయింది.
ఈ జోడీకి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత రాహుల్ పునర్నవి వేర్వేరుగా బిజీ అయ్యారు.
అయితే ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ అషురెడ్డి మధ్య ఏదో ఉందంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.రాహుల్ అషురెడ్డి కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి.
రాహుల్ అషురెడ్డి కూడా తమ మధ్య ఏదో ఉందనే అనుమానం కలిగేలా ప్రవర్తించారు.అయితే గత కొన్నిరోజుల నుంచి ఈ జోడీ సైలెంట్ గానే ఉండటం గమనార్హం.
బిగ్ బాస్ షో ద్వారా ఈ కంటెస్టెం ట్లు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో కూడా ఫాలోవర్లను భారీస్థాయిలో పెంచుకున్నారు.
సోషల్ మీడియాలో లైవ్ ఛాట్ లో పాల్గొంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్లు తమ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు.

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ సుజాత లైవ్ చాట్ లోకి రాగా నెటిజన్లు తమ ప్రశ్నలతో సుజాతను అవాక్కయ్యేలా చేయడం గమనార్హం.పెళ్లి, లవర్, ఇతర వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నలు ఎదురు కాగా సుజాత తనదైన శైలిలో జవాబులు ఇచ్చి కవర్ చేశారు.
నోయల్, లాస్య గురించి ప్రశ్నలు ఎదురు కాగా లాస్యను బంగారు కోడిపెట్ట అని చెప్పిన సుజాత నోయల్ ను శంకర్ దాదా ఎంబీబీఎస్ అని చెప్పారు.

అయితే రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రశ్నలు ఎదురు కాగా ఆ ప్రశ్నలకు మాత్రం సుజాత రాహుల్ సిప్లిగంజ్ కు కేరింగ్ ఎక్కువని పేర్కొన్నారు.రాహుల్ స్మైల్ ఎంత బాగుంటుందో మాట తీరు కూడా అంతే బాగుంటుందని సుజాత అన్నారు.దీంతో రాహుల్ కు సుజాత కూడా పడిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.