చప్పుడు చేయని కొత్త పార్టీ ?

బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యమని వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం తెస్తామని అత్యంత అటాహసంగా పార్టీని ప్రకటించిన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ( Bode Ramachandra Yadav ) రాష్ట్ర రాజకీయాల నుంచి అంతర్దానమయ్యారా? ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలు అత్యంత కీలకమైన దశ .తమ బలాన్ని పెంచుకునేలా అనేక కార్య క్రమాలు చేపట్టాలి.

 Bcy Party Silent In Ap Politics , Bcy Party, Ap Politics , Ys Jagan, Bode Rama-TeluguStop.com

పార్టీ నిర్మాణం చేయాలి .గ్రామాల వారి , మండలాల వారి కమిటీ లు వెయ్యాలి , కీలక నాయకులను ఆకర్షించగలగాలి ,మరో బారతీయ చైతన్య పార్టీ మాత్రం కనీస హడావుడి కూడా చేయడం లేదు.దాంతో 2023 ఎన్నికలపై బీసీవై పార్టీ( BCY party ) ఆశ వదిలేసుకుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Ap, Bcs, Bcy, Boderamachandra, Ys Jagan-Telugu Political News

ప్రారంభంలో ఒక స్థాయిలో ఈ పార్టీ హడావిడి చేసింది ముఖ్యంగా దాదాపు 5 లక్షల మందితో ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం, కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలోకి ఆకర్షించడం, ఘనంగా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడం వంటి చర్యలతో ఈ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తిని కలగజేసింది , అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన పేరుతో ఉద్యోగుల సంబరం అంటూ అంటూ 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం అంటూ ఈ పార్టీ ఒక కార్యక్రమాన్ని ఘనంగా ప్రకటించింది.ఇది మీడియా లో కూడా బాగానే చర్చనీయాంశం గా మారింది అయితే ఆ కార్యక్రమంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఆ తదనంతర పరిణామాలపై ఎటువంటి అప్డేట్స్ పార్టీ నుంచి లేవు అంతేకాకుండా పార్టీ క్రియాశీలక కమిటీల నియామకం పార్టీ విస్తరణ పై కూడా ఎటువంటి ప్రకటనలు లేవు .దాంతో 2023 ఎన్నికలను( 2023 elections ) ఈ పార్టీ లితే తీసుకుందా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి .

Telugu Ap, Bcs, Bcy, Boderamachandra, Ys Jagan-Telugu Political News

ఏది ఏమైనప్పటికీ రాజకీయ కార్యాచరణ అన్నది దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉండాలి తప్పఇలా వచ్చి అలా వెళ్లిపోయే మేఘం లా ఉండకూడదు అన్నది రాజకీయ మేధావుల మాట.మరి తన ఆరంభం ఘనంగా ప్రకటించుకున్న ఈ పార్టీ ఉన్నట్టుండి అంతర్ధానం వెనక కారణాలు ఏమిటా? అన్నది అంతుపట్టని విధం గా మారింది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube