ఈస్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా.. అయితే ఇది మీకోసమే..

ఈస్ట్ ఇన్ఫెక్షన్ కాండిడా అల్బికాన్స్ అనే ఫంగల్ పెరుగుదల వల్ల కలిగే ఫంగల్ ఇన్ఫెక్షన్ యోనిలో కాండిడా, బ్యాక్టీరియాతో సహా ఈస్ట్ కూడా ఉంటుంది.ఇది ఎక్కువగా పెరిగినప్పుడు సంక్రమణకు దారి తీస్తుంది.

 Are You Suffering From Yeast Infection But This Is For You , Yeast Infection, H-TeluguStop.com

ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల యోని దగ్గర, లోపల, దురద, చికాకు, మంట, వాల్వల్ వాపు, యోని నొప్పి, దద్దుర్లు, వాసనలేని మందపాటి తెల్లగా ఉండే ఉత్సర్గ వంటి సమస్యలు వస్తాయి.అయితే ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు కారణాలు ఎన్నో ఉన్నాయి.

అందులో కొన్ని సాధారణ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.దీని వల్ల కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుందంటే చాలామంది నమ్మరు.

కానీ ఇది నిజమని నిపుణులు చెబుతున్నారు.అవును రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నవారి యోనిలో ఈస్ట్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.

రక్తంలో ఎక్కువ చక్కర స్థాయిలో సిలింద్రాలకు సంతాన ఉత్పత్తికి కేంద్రంగా పనిచేస్తుంది.

Telugu Antibiotics, Tips, Pantyliners, Yeast, Yeastcandida-Telugu Health

దీని వల్ల శిలింద్రాల సంఖ్య బాగా పెరిగిపోతుంది.అయితే ఈ అదనపు చక్కెర జననేంద్రియ ప్రాంతాల్లో పిహెచ్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.ఇది ఈస్ట్ పెరిగేందుకు దారితీస్తుంది.

యాంటీ బయోటిక్స్ ఎన్నో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఎంత గానో ఉపయోగపడతాయి.ఇవి బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటాయి లేదా అదుపులో ఉంచుతాయి.

అయినప్పటికీ యాంటీ బయోటిక్స్ వాడకం కూడా ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.వీటిలో ఒకటి ఈస్ట్ ఇన్ఫెక్షన్, చెడు బ్యాక్టీరియాలను నాశనం చేసే యాంటీబయోటిక్ యోనిలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలను కూడా చంపగలదు.

Telugu Antibiotics, Tips, Pantyliners, Yeast, Yeastcandida-Telugu Health

ఇది ఈస్ట్ పెరుగుదలకు కారణం అవుతుంది.పాంటీలైనర్లు ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతున్నాయని నిరూపించడానికి బలమైన ఆధారాలు ఏమీ లేవు.కానీ దీర్ఘకాలంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు గురయ్యే ఆడవారు పాంటీలైనర్లు కూడా వాడకూడదని సలహాలు ఇస్తారు.ఎందుకంటే ఇవి తేమను అలాగే నిలిపివేస్తాయి.అంతేకాకుండా గాలిని నిరోధిస్తాయి.దీని వల్ల అక్కడ ఈస్ట్ బాగా పెరిగిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube