టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల విచారణ ఇవాళ అత్యంత కీలకంగా మారనుంది.విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు పిటిషన్లపై విచారణ జరగనుంది.
ఈ క్రమంలో న్యాయస్థానాల్లో తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తాయా? లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.ఇప్పటికే ఈ పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం ఏం తీర్పు ఇస్తుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ జరగనుంది.ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులపై ఇప్పటికే పీటీ వారెంట్ తో పాటు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు.
ఈ క్రమంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో పాటు ఫైబర్ నెట్ స్కాం కేసులో సీఐడీ పీటీ వారెంట్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశం ఉంది.అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ స్కాం కేసుతో పాటు అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు కేసుల్లో కోర్టు తీర్పులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







