బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యమని వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం తెస్తామని అత్యంత అటాహసంగా పార్టీని ప్రకటించిన బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ( Bode Ramachandra Yadav ) రాష్ట్ర రాజకీయాల నుంచి అంతర్దానమయ్యారా? ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలు అత్యంత కీలకమైన దశ .
తమ బలాన్ని పెంచుకునేలా అనేక కార్య క్రమాలు చేపట్టాలి.పార్టీ నిర్మాణం చేయాలి .
గ్రామాల వారి , మండలాల వారి కమిటీ లు వెయ్యాలి , కీలక నాయకులను ఆకర్షించగలగాలి ,మరో బారతీయ చైతన్య పార్టీ మాత్రం కనీస హడావుడి కూడా చేయడం లేదు.
దాంతో 2023 ఎన్నికలపై బీసీవై పార్టీ( BCY Party ) ఆశ వదిలేసుకుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
"""/" / ప్రారంభంలో ఒక స్థాయిలో ఈ పార్టీ హడావిడి చేసింది ముఖ్యంగా దాదాపు 5 లక్షల మందితో ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం, కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలోకి ఆకర్షించడం, ఘనంగా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించడం వంటి చర్యలతో ఈ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తిని కలగజేసింది , అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన పేరుతో ఉద్యోగుల సంబరం అంటూ అంటూ 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం అంటూ ఈ పార్టీ ఒక కార్యక్రమాన్ని ఘనంగా ప్రకటించింది.
ఇది మీడియా లో కూడా బాగానే చర్చనీయాంశం గా మారింది అయితే ఆ కార్యక్రమంలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఆ తదనంతర పరిణామాలపై ఎటువంటి అప్డేట్స్ పార్టీ నుంచి లేవు అంతేకాకుండా పార్టీ క్రియాశీలక కమిటీల నియామకం పార్టీ విస్తరణ పై కూడా ఎటువంటి ప్రకటనలు లేవు .
దాంతో 2023 ఎన్నికలను( 2023 Elections ) ఈ పార్టీ లితే తీసుకుందా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి .
"""/" /
ఏది ఏమైనప్పటికీ రాజకీయ కార్యాచరణ అన్నది దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉండాలి తప్పఇలా వచ్చి అలా వెళ్లిపోయే మేఘం లా ఉండకూడదు అన్నది రాజకీయ మేధావుల మాట.
మరి తన ఆరంభం ఘనంగా ప్రకటించుకున్న ఈ పార్టీ ఉన్నట్టుండి అంతర్ధానం వెనక కారణాలు ఏమిటా? అన్నది అంతుపట్టని విధం గా మారింది .
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్28, సోమవారం 2025