మండేలాపై మనసు పడ్డ బండ్ల గణేష్.. రీమేక్ ప్రయత్నాలు

ఒక బాషలో హిట్ అయిన సినిమాలని మరో బాషలో రీమేక్ చేయడం సర్వసాధారణంగా జరుగుతుంది.డిఫరెంట్ కథాంశంతో ఉండి మిగిలిన బాషలలో కూడా వర్క్ అవుట్ అవుతుంది అనిపించే కథలపై దర్శక, నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రీమేక్ రైట్స్ సొంతం చేసుకొని దానికి కావాల్సిన క్యాస్టింగ్ అండ్ క్రూని సమకూర్చుకొని సెట్స్ పైకి సినిమాని తీసుకెళ్తారు.

 Bandla Ganesh Interested To Remake Mandela Movie, Tollywood, Comedian Yogi Babu,-TeluguStop.com

పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన వకీల్ సాబ్ హిందీ పింక్ మూవీ రీమేక్ అనే విషయం తెలిసిందే.అలాగే వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలలో రెండు రీమేక్ లే.అలాగే మలయాళం నుంచి ఒక అరడజను సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే తమిళ్ లో స్టార్ కమెడియన్ గా ఉన్న యోగిబాబు లీడ్ రోల్ లో మండేలా అనే కామెడీ సెటైరికల్ ఎంటర్టైన్మెంట్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

నటుడిగా యోగిబాబుకి ఈ సినిమా మరింత క్రేజ్ తీసుకొచ్చింది.

ఇక ఈ సినిమాలో నాయీ బ్రాహ్మణులని కించపరిచారని పోలీస్ కేసు కూడా నమోదైంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పుడు నిర్మాత బండ్ల గణేష్ కన్ను పడింది.ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ దయతో నిర్మాత అయిపోయాడు.

అయితే ఆర్టిస్ట్ గా మాత్రం పూర్తి సంతృప్తినిచ్చే పాత్రని తన కెరియర్ లో ఇప్పటి వరకు చేయలేకపోయాడు.నిర్మాత అయిన తర్వాత ఆర్టిస్ట్ గా సినిమాలు తగ్గించేసిన రీసెంట్ గా అనిల్ రావిపూడి బలవంతం మీద సరిలేరు నీకెవ్వరూ సినిమాలో బ్లేడ్ గణేష్ అనే పాత్రలో కాసేపు కనిపించి వినోదం అందించాడు.

అయితే ఈ సారి పూర్తి నిడివి ఉన్న పాత్రలో కనిపించాలని మండేలా రీమేక్ హక్కుల కోసం బండ్ల గణేష్ ప్రయత్నం చేస్తున్నాడు.ఈ సినిమాని నిర్మించడంతో పాటు టైటిల్ రోల్ కూడా తానే పోషించాలని భావిస్తున్నాడు.

మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube