రేవంత్ రెడ్డికి కొత్త శత్రువుల్ని తయారు చేస్తున్నారా..?

10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ( BRS ) పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు కాంగ్రెస్ పార్టీ.ఇక కాంగ్రెస్ కేవలం ఒకే ఒక సంవత్సరంలో చాలా పుంజుకుంది.

 Are You Making New Enemies For Revanth Reddy , Revanth Reddy, Ts Congress , Rahu-TeluguStop.com

=దానికి ప్రధాన కారణం కూడా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) ఎన్నిక కావడమే.పిసిసి చీఫ్ అయ్యాక రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కృషి చేశారు.

అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఎల్లో మీడియా మాత్రం రేవంత్ రెడ్డికి కొత్త కొత్త శత్రువుల్ని సృష్టిస్తుంది.అయితే రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి సహాయపడ్డారు అందులో డౌటే లేదు.

కానీ ఎల్లో మీడియా మాత్రం రేవంత్ రెడ్డి సీఎం చేయాలని అలాగైతే చంద్రబాబుకు కూడా సహాయపడతారని, ఈయన కాకుండా వేరే ఎవరైనా సరే చంద్రబాబుకి అంతగా ఉపయోగముండదని,ఈ కారణంతోనే ఎల్లో మీడియా రేవంత్ రెడ్డికి కొత్త కొత్త శత్రువులను సృష్టిస్తూ వస్తున్నారు.

Telugu Candrababu, Congress, Komativenkat, Revanth Reddy, Seetakka, Telangana, Y

ఇక కొత్త శత్రువులు అంటే ఎవరో కాదు కాంగ్రెస్ ( Congress ) పార్టీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమందిని తయారు చేస్తున్నారు.అయితే అసలు విషయం ఏమిటంటే… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎవరు సీఎం అవుతారని ప్రతి ఒక్కరిలో ఒక అనుమానం ఉంది.అయితే చాలామంది రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలి అని అనుకున్నప్పటికీ ఆయనకంటే సీనియర్ లు చాలామంది ఉన్నారు.

ఒకవేళ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని సీఎంగా ఒప్పుకోకపోతే ఓటింగ్ జరుగుతుంది అని తెలుస్తోంది.ఓటింగ్ లో ఎవరికీ ఎక్కువగా మద్దతు వస్తే వాళ్లే సీఎం అవుతారని సమాచారం.

Telugu Candrababu, Congress, Komativenkat, Revanth Reddy, Seetakka, Telangana, Y

అయితే ఇప్పటికీ సిఎల్పీ మీటింగ్ కొనసాగుతోంది.ఇక ఏది క్లారిటీ లేక ముందే ఇదిగో రేవంత్ సీఎం అదిగో రేవంత్ సీఎం అంటూ ప్రచారాలు చేస్తున్నారు.అయితే ఇలా జరిగితే కచ్చితంగా రేవంత్ రెడ్డికి పార్టీలోనే శత్రువులు తయారవుతారు.ఇప్పటికే రేవంత్ పీసీసీ చీఫ్ అయిన సమయంలో అధిష్టానం పై చాలామంది సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారు.

అయితే కాంగ్రెస్ ఇంకా మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోలేదు.ఇంకో ఐదు స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్ కి వచ్చేది.అయితే ఇలాంటి సమయంలో ఎల్లో మీడియా ఇలా రేవంత్ మీద హైప్ పెంచుతూ మిగిలిన వారికి కోపం తెప్పిస్తే మాత్రం కాంగ్రెస్లో ఏదైనా జరగొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇక సీఎం ఎవరైనా పరవాలేదు కానీ ఎల్లో మీడియా మాత్రం రేవంత్ రెడ్డి గురించి హైప్ పెంచడం వల్ల కాంగ్రెస్లో ఆయనకు కొత్త కొత్త శత్రువులు తయారవుతారు.

ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న చాలా మంది సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి ( Revanth reddy ) పై కాస్త అసంతృప్తితో ఉన్నారు.ఇలాంటి సమయంలో ఎల్లో మీడియా అత్యుత్సాహం రేవంత్ రెడ్డిని దెబ్బ కొడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube