ఒక్కోసారి కొంత మంది హీరో లేదా హీరోయిన్లు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోతుంటారు.కాగా 2013వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు రాధా మోహన్ దర్శకత్వం వహించిన “గౌరవం” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన ప్రముఖ సినీ నిర్మాత “అల్లు అరవింద్” కొడుకు “అల్లు శిరీష్” కూడా ఈ కోవకే చెందుతాడు.
నటన పరంగా టాలెంటు ఉన్నప్పటికీ అల్లు శిరీష్ తన చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఇప్పటివరకు సరైన హిట్ లేక సినిమా ఇండస్ట్రీలో కొనసాగడానికి ఇబ్బంది పడుతున్నాడు.
కాగా ప్రస్తుతం అల్లు శిరీష్ తెలుగులో యంగ్ దర్శకుడు “రాకేష్ శశి” దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో అల్లు శిరీష్ కి జంటగా మలయాళ బ్యూటీ “అను ఇమ్మానియేల్” నటిస్తోంది.కాగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.
ఇటీవలే ఈ విషయానికి సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.అలాగే ఈ నెల 30వ తారీఖున అల్లు శిరీష్ పుట్టిన రోజు కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

అయితే గత కొద్ది కాలంగా అల్లు శిరీష్ సరైన హిట్ లేక సతమతమవుతున్న కారణంగా ఈ సారి తన తండ్రి అల్లు అరవింద్ మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ కథ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రాకేష్ శశి గతంలో కళ్యాణ్ దేవ్ నటించిన “విజేత” అలాగే యంగ్ హీరో అశ్విన్ హీరోగా నటించిన “జతకలిసే” తదితర చిత్రాలకి దర్శకత్వం వహించాడు.