అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది.ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు అధికారికంగా రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్లను పొందారు.
మరోసారి వీరిద్ధరే తుదిపోరులో తలపడుతున్నారు.రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్ధిత్వం కోసం పోటీపడిన ఒక్కొక్కరిని ట్రంప్( Donald Trump ) మట్టికరిపిస్తూ ముందుకు సాగారు.
మరి ట్రంప్ అధ్యక్షుడిగా గెలుపొందితే.ఉపాధ్యక్షుడెవరు( Vice President ) అన్నదానిపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్న మొన్నటి వరకు ఉపాధ్యక్షుడు అవుతాడనుకున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిని ట్రంప్ పక్కనపెట్టేశారు.ఈ నేపథ్యంలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది.
సెనేటర్ మార్కో రూబియో .( Senator Marco Rubio ) ట్రంప్ ఉప్యాధ్యక్ష ఎంపికల్లో ఒకరిగా పరిగణించబడుతున్నారు.న్యూస్‌మాక్స్‌కి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆశావహుల లిస్టులో దాదాపు 15 మంది వున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
మూడోసారి సెనేటర్‌గా ఎన్నికైన రూబియా (52)పై ట్రంప్ సీరియస్‌గా వున్నట్లు సమాచారం.
కానీ రూబియో కూడా వైస్ ప్రెసిడెంట్‌గా మారడానికి ఆసక్తి చూపుతున్నారా లేదా అన్నది అస్పష్టంగా వుంది.మేమిద్దరం ఒకే రాష్ట్రానికి చెందినవాళ్లం, కానీ వాస్తవంలో ఇది పనిచేయదని రూబియో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
![Telugu America, Democratic, Donald Trump, Florida, Floridamarco, Iowa Caucus, Ma Telugu America, Democratic, Donald Trump, Florida, Floridamarco, Iowa Caucus, Ma](https://telugustop.com/wp-content/uploads/2024/03/All-about-Florida-senator-Marco-Rubio-being-considered-Trump-potential-VP-pick-detailsa.jpg)
2016 అధ్యక్ష ఎన్నికల నామినేషన్ కోసం ట్రంప్, రూబియోలు పోటీపడ్డారు.అప్పట్లో తన ప్రచారంలో ట్రంప్.రూబియోకు లిటిల్ మార్కో అని పేరు పెట్టారు.దీనికి రూబియో సైతం అదే స్థాయిలో కౌంటరివ్వడంతో వారిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.అయితే ట్రంప్ వైట్‌హౌస్ ఎజెండాకు రూబియో మద్ధతు ఇవ్వడంతో వారి బంధం మెరుగుపడింది.ఈ ఏడాది జనవరిలో జరిగే అయోవా కాకస్‌లకు( Iowa Caucus ) ముందు ట్రంప్‌ను రూబియో ఎండార్స్ చేశారు.
![Telugu America, Democratic, Donald Trump, Florida, Floridamarco, Iowa Caucus, Ma Telugu America, Democratic, Donald Trump, Florida, Floridamarco, Iowa Caucus, Ma](https://telugustop.com/wp-content/uploads/2024/03/All-about-Florida-senator-Marco-Rubio-being-considered-Trump-potential-VP-pick-detailss.jpg)
క్యూబా నుంచి అమెరికాకు వలస వచ్చిన వలసదారులకు రూబియో మాయమిలో జన్మించారు.2010లో యూఎస్ సెనేట్‌కు ఎన్నికయ్యే ముందు వెస్ట్ మియామిలో నగర కమీషనర్‌గా, ఫ్లోరిడా ప్రతినిధుల సభ స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు.సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ లామేకింగ్.రూబియోను అత్యంత ప్రభావవంతమైన రిపబ్లికన్‌గా ర్యాంక్ చేసింది.రూబియో .జీనెట్‌ను 1998లో వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు అమండా, డానియెల్లా, ఆంథోనీ, డొమినిక్ అనే నలుగురు సంతానం.