అఖండ టైటిల్ సాంగ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య గర్జన!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘అఖండ‘.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ముగించేసుకుంది.

 Akhanda Title Song Out Now, Diwali 2021, Akhanda, Balakrishna, Boyapati Srinu, P-TeluguStop.com

ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు అన్ని కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి.కరోనా వల్ల ఆలస్యం లేకపోతే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

ఇక ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ సాంగ్ విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ సాంగ్ లో బాలయ్య అఘోర పాత్రలో కనిపించాడు.

భం అఖండ భం భం అఖండఅంటూ సాగుతూన్న ఈ లిరికల్ సాంగ్ బాలయ్య గర్జనతో గూస్ బంప్స్ వ
స్తున్నాయి.ఈ రోజు కార్తీక మాసం తోలి సోమవారం సందర్భంగా శివుడికి సంబంధించిన ఈ పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ప్రెసెంట్ ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను తన కుమారులు సిద్ధార్థ్, శివమ్ తో కలిసి శంకర్ మహదేవన్ పాడారు.ఇక ఈ పాటకు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించాడు.ఇక ఈ లిరికల్ వీడియోలో మేకింగ్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది ఈ సాంగ్ చిత్రీకరణ ఏ తరహాలో సాగిందో అని.

ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైశ్వాల్ నటిస్తుండగా.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సింహ, లెజెండ్ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు.చూడాలి మరి వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కూడా అంచనాలను అందుకుంటుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube