జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో అదిరే అభి ఒకరు.చాలారోజుల పాటు జబర్దస్త్ షోకు పరిమితమైన అదిరే అభి ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల ఆ షోకు దూరమై ఇతర షోలతో బిజీ అయ్యారు.
అయితే వేర్వేరు కారణాల వల్ల ప్రస్తుతం జబర్దస్త్ షో ఆశించిన స్థాయిలో రేటింగ్ లను సొంతం చేసుకోవడం లేదనే సంగతి తెలిసిందే.తాజాగా అదిరే అభి ఈ షో గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
జబర్దస్త్ షోకు ఎవరు దిష్టి పెట్టారో అని మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నామని అదిరే అభి పేర్కొన్నారు.అమ్మలాంటి మల్లెమాల కుటుంబంలో కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదని అప్పుడు జబర్దస్త్ షోలో కనిపించిన పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదనే అర్థం వచ్చేలా అదిరే అభి కామెంట్లు చేశారు.
ప్రస్తుతం ఎవరి దారి వారిదైందని అందరినీ నవ్వించే జబర్దస్త్ కు మళ్లీ నవ్వించే రోజులు వస్తే బాగుంటుందని అదిరే అభి తెలిపారు.

జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లలో చాలామంది ఈ షో గురించి పాజిటివ్ గా స్పందించిన సంగతి తెలిసిందే.కొంతమంది మాత్రం ఈ షో గురించి నెగిటివ్ కామెంట్స్ చేయడం ద్వారా వార్తల్లో నిలవడం జరిగింది.జబర్దస్త్ షోకు గతంలోలా భారీ స్థాయిలో రేటింగ్స్ కూడా రావడం లేదు.
రాబోయే రోజుల్లో అయినా ఈ షో పుంజుకుంటుందేమో చూడాల్సి ఉంది.