ఆచార్య మూవీకి చరణ్ భార్య ఉపాసన రివ్యూ ఇదే.. సినిమా అలా ఉందని చెబుతూ?

మెగా అభిమానులు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆచార్య సినిమా ఫ్లాప్ అనే సంగతి తెలిసిందే.తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు వల్ల ఆచార్య తొలిరోజు కలెక్షన్లు బాగానే ఉన్నా సామాన్య ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు దూరంగా ఉండటం గమనార్హం.

 Actress Upasana Review For Acharya Movie Details Here Goes Viral , Acharya Movie-TeluguStop.com

పెరిగిన టికెట్ రేట్ల వల్ల ఆచార్య మూవీ భారీగా నష్టపోయింది.ఆచార్య సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా క్రేజ్ లేకపోవడంతో పాటు టికెట్ రేట్ల పెంపుతో సామాన్య ప్రేక్షకులు ఈ సినిమాకు దూరమయ్యారు.

ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్2 సినిమాలకు టికెట్ రేట్లు పెంచినా ఆ సినిమాలకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటంతో పాటు హిట్ టాక్ రావడం ప్లస్ అయింది.టికెట్ రేట్లు మరీ ఎక్కువగా పెంచితే నిర్మాతలకు లాభం వస్తుందని జరిగే ప్రచారం అన్ని సినిమాల విషయంలో నిజం కాదని ఈ సినిమాతో ప్రూవ్ అయింది.

అయితే ఈ సినిమాను ఏఎంబీ మాల్ లో చూసిన ఉపాసన ఈ సినిమాకు తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.

లవ్ లవ్ లవ్ ది మూవీ అంటూ ఉపాసన ఆచార్య సినిమాకు రివ్యూ ఇవ్వడం గమనార్హం.

ఉపాసన ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చకపోయినా ఉపాసనకు మాత్రం నచ్చడం గమనార్హం.

ఆచార్య ఫస్ట్ డే కలెక్షన్లు బాగానే ఉన్నా రెండో రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు అంతకంతకూ తగ్గుతున్నాయని సమాచారం అందుతోంది.

Telugu Acharya, Amb Mall, Chirenjeevi, Kgf, Ram Charan, Upasana-Movie

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఆచార్య సినిమా రేంజ్ ను డిసైడ్ చేయనున్నాయి.సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించి భారీ డ్రాప్ కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు 50 శాతం మేరకు నష్టాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube