ఆమీర్ ఖాన్ ని థియేటర్ లో చూడటం దగ్గరనించి ఆమీర్ ఖాన్ నుంచి రిప్లై దొరికేదాకా ఎదిగింది సన్ని లియోన్.అయినా ఆ అభిమానం అలానే ఉంది.
ఆమీర్ అంటే పిచ్చి ఇంకా తగ్గలేదు.కాని ఆమీర్ పేరు తలచుకోని సంతోషించాల్సింది పోయి బాధపడుతోంది సన్ని.
ఈరోజు మధ్యాహ్నం ఒక జాతీయ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది సన్ని.అక్కడ తన అభిమాన హీరో ఆమీర్ ఖాన్ టాపిక్ రానే వచ్చింది.అప్పుడు సన్ని ” ఆమీర్ ఖాన్ అంటే నాకు విపరీతమైన అభిమానం.ఆయనతో ఎప్పటికైనా ఓ సినిమా చేయాలనేది నా కోరిక.
కాని నాకు తెలిసి ఆ కోరిక ఎప్పటికి తీరదు.ఆమీర్ తో నాతో కలిసి ఎప్పటికీ పని చేయకపోవచ్చు.
దానికి కారణం నా గతం.బాధగా లేదు అనను, కాని ఇక్కడిదాకా వచ్చాను అంటే దానికి నా గతమే కారణం కదా.నేను ఒకప్పుడు చేసింది తప్పు అని అనుకోను.” అంటూ చెప్పుకొచ్చింది సన్ని.
ఆమీర్ రిప్లై ఇస్తాడు అనుకుందా సన్ని? లేదు! కాని ఆమీర్ రిప్లై ఇచ్చాడు.అలాగే ఓ అవకాశం కూడా ఇచ్చి తన వీరాభిమాని కోరిక తీర్చేస్తే బాగుంటుంది .