ఎన్టీఆర్ ఈసారైనా సాధిస్తాడా?

నటనలో తోపు.పేజి డైలాగులైనా గుక్కతిప్పుకోకుండా చెప్పెయ్యగలడు.

 Will Ntr Gets Into 50cr Club This Time?-TeluguStop.com

డ్యాన్స్ ఇరగదీస్తాడు.గొంతు ఎత్తాడంటే చాలు, తను ఫ్రొఫేషనల్ సింగర్ అనుకోవాల్సిందే.

అందరికి మీసాలు రావడం మొదలయ్యే వయసులోనే రికార్డుల మోత మోగించాడు.అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు, ఎన్టీఆర్ 50 కోట్ల షేర్ మాత్రం అందుకోవట్లేదు.

ఈ 50 కోట్ల షేర్ ట్రెండ్ రాజమౌళి మగధీరతో మొదలయ్యింది.మహేష్ బాబు దూకుడు,సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, శ్రీమంతుడు చిత్రాలతో ఈ 50 కోట్ల క్లబ్ లో అగ్రస్థానం సంపాదించాడు.

పవన్ కళ్యాణ్ రెండు చిత్రాలు గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది ఈ క్లబ్ లో చేరాయి.అల్లు అర్జున్ కి రేసుగుర్రం రూపంలో 50కోట్ల సినిమా ఉంది.

రాజమౌళి సినిమాలు మగధీర, బాహుబలిలతో రామ్ చరణ్, ప్రభాస్ కూడా 50 కోట్ల హీరోలు అయిపోయారు.ఇక టాప్ హీరోల్లో మిగిలింది ఎన్టీఆర్ ఒక్కడే.

బాద్షా కొడుతుంది అనుకుంటే, 47 కోట్ల దగ్గరే ఆగిపోయింది.హిట్ టాక్ వచ్చిన టెంపర్ అయినా కొడుతుంది అనుకుంటే అది 42 కోట్లతోనే అడ్జస్టు చేసుకుంది.

ఇక నాన్నకు ప్రేమతో టాక్ బాగానే ఉన్నా, ఈసారి కూడా పక్కగా చెప్పలేని పరిస్థితి.ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల షేర్ మార్కు దగ్గర్లో ఉన్నా, 50 కోట్ల షేర్ అంటే ఇంకా దూరపు ప్రయాణమే.

సోగ్గాడే చిన్నినాయన రూపంలో నాగార్జున పెద్ద అడ్డుకట్టలా తయారయ్యాడు.మరి ఈసారైనా ఎన్టీఆర్ టార్గెట్ రీచ్ అవుతాడా? తన స్టామినాపై అపనమ్మకం పెంచుకున్నవాళ్ళందరి నోళ్ళు మూయిస్తాడా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube