లయన్ కింగ్‌లో లాగానే పుట్టగానే గర్జించిన సింహం పిల్ల.. వీడియో వైరల్..

లయన్ కింగ్( Lion King ) సినిమాలో సింబ అనే సింహంపిల్ల రాజ్యానికి రాజు అవ్వడానికి ముందు రాజు లాగా ప్రవర్తిస్తుంటుంది.అది చిన్నతనంలోనే గర్జించడానికి ప్రయత్నిస్తుంది.

 A Lion Cub Practising Its Roar Video Viral Details, Lion King, Viral Video, Lion-TeluguStop.com

ఆ సన్నివేశాలు ఎంతో ఆకట్టుకుంటాయి.అచ్చం అలాంటి సన్నివేశాన్ని నిజజీవితంలో చోటుచేసుకుంది.

రియల్ లైఫ్ లో ఒక సింహం పిల్ల తొలిసారిగా గర్జిస్తున్న( Lion Cub Roar ) వీడియో వైరల్‌గా మారింది, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను దోచుకుంది.సైన్స్ గర్ల్ అనే ట్విట్టర్‌ అకౌంట్ షేర్ చేసిన ఈ వీడియోలో చిన్న పిల్ల తన తల్లి ముందు నిలబడి ఉన్నట్లు కనిపించింది.

పిల్ల శ్వాస తీసుకుని చిన్నగా, కీచుగా గర్జిస్తుంది.

ఈ వీడియో 40 లక్షలకు పైగా వ్యూస్‌ సంపాదించింది.ఈ సింహం పిల్ల( Lion Cub ) క్యూట్‌నెస్ చూసి “ఇది నేను చూసిన అందమైన విషయం” అని ఒక వ్యక్తి పేర్కొన్నాడు.“చిన్న పిల్ల చాలా ధైర్యంగా గర్జిస్తుంటే ముచ్చటేస్తుందని ఇంకో ఇంకో వ్యక్తి పేర్కొన్నాడు.“ఇది అతని లైఫ్ జర్నీకి ప్రారంభం మాత్రమే” అని నెటిజన్ కామెంట్ చేశాడు.సింహం పిల్ల మొదటి గర్జన కొత్త ప్రారంభానికి చిహ్నం.

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం చిన్న ప్రాణులకు కూడా ఉందని గుర్తు చేశారు.

సింహం పిల్లకు 8-10 వారాల వయస్సు ఉంటుంది.సింహం పిల్లలు సాధారణంగా ఈ వయస్సులోనే గర్జించడం ( Roaring ) ప్రారంభిస్తాయి.వీడియోలో పిల్ల తల్లి అతనిని కాపాడుతుండటం చూడవచ్చు.

తల్లి కొద్దిరోజుల పాటు ఈ సింహం పిల్లకు రక్షణ అందించాలి.లేదంటే ఇతర క్రూర జంతువులు దానిని వెంటనే చంపేస్తాయి.

సింహాలకు కూడా ప్రాణహాని ఉంటుంది.పాము కాట్లు జంతువుల పోరాటంలో గాయాల వల్ల ఇవి మరణిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube