రాఘవ లారెన్స్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘గంగ’.భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సమయంలో అనేక అవాంతరాలను ఎదుర్కొంది.
ఎట్టకేలకు పూర్తి అయ్యిందని, విడుదలకు సిద్దం అవుతుందని భావించిన సమయంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా వేయడం జరిగింది.ఈనెల 17న తెలుగు మరియు తమిళంలో విడుదల చేయాలని భావించినా కూడా తెలుగులో విడుదల కాలేదు.
దాంతో ఇప్పుడు తెలుగులో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను విడుదల చేయడంలో చేతులు ఎత్తేశాడు.
దాంతో ‘గంగ’ బాధ్యతను దిల్‌రాజుకు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.అందుకోసం ఇప్పటికే దిల్‌రాజుకు ‘గంగ’ సినిమాను చూపించాడట.
దిల్‌రాజు కూడా ‘గంగ’ సినిమాపై ఆసక్తిని కనబర్చినట్లుగా తెలుస్తోంది.అయితే దిల్‌రాజు తీసుకున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మరియు ‘ఓకే బంగారం’ సినిమాలు థియేటర్లలో ఆడుతున్నాయి.
దాంతో ‘గంగ’ సినిమాను కాస్త ఆలస్యంగా విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.తమిళంలో ఇప్పటికే ఈ సినిమా సక్సెస్ అయిన విషయం తెల్సిందే.