ఈ రెండు పార్టీల స్నేహం మూడునాళ్ల ముచ్చటేనా?

సార్వత్రిక ఎన్నికలు పూర్తి కాగానే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ మరియు ఎంఐఎంలు చాలా దగ్గరయిన విషయం తెల్సిందే.రెండు పార్టీల నాయకులు కూడా పలు సార్లు భేటీ అయ్యాయి.

 Trs Party Break Up With Mm-TeluguStop.com

రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పరస్పరం సహరించుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చాయి.అయితే తాజాగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఎంఐఎంకు మింగుడు పడుతున్నట్లుగా అనిపించడం లేదు.

ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న మెట్రో రైలు మార్గం మార్పును వ్యతిరేకిస్తూన్న ఎంఐఎం తాజాగా టీఆర్‌ఎస్‌తో మరింత దూరం జరగాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ను మూడు భాగాలు చేయాలనే నిర్ణయాన్ని ఎంఐఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

మూడు భాగాలుగా చేస్తే ఎంఐఎం కేవలం పాతబస్తీకే పరిమితం అవుతుంది.మిగిలిన ప్రాంతాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారాన్ని దక్కించుకోనే అవకాశముంది.

అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలని ఎంఐఎం డిమాండ్‌ చేస్తున్నా, అదేమీ పట్టనట్లుగా తెలంగాణ ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తోంది.దానికి తోడు టీఆర్‌ఎస్‌ గత కొన్ని రోజులుగా బీజేపీతో చాలా సన్నిహితంగా ఉంటోంది.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న కారణంగా టీఆర్‌ఎస్‌ కమలం వైపు చూస్తుందనే అనుమానాలు కూడా ఎంఐఎంకు వస్తున్నాయి.అందుకే టీఆర్‌ఎస్‌కు దూరం అవ్వాలనే నిర్ణయానికి ఆ పార్టీ వచ్చినట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి వీరి స్నేహం మూడునాళ్ల ముచ్చటగానే అయ్యిందన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube