ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గాలని( Weight Loss ) ప్రయత్నిస్తున్న వారి సంఖ్య కౌంట్ లెస్ గా ఉంది.బరువు తగ్గడం అంటే తినడం మానేయడం అస్సలే కాదు.
పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం.ఇక బరువు తగ్గడానికి కొన్ని కొన్ని జ్యూసులు చాలా అద్భుతంగా మద్దతు ఇస్తాయి.
ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కూడా ఆ కోవకు చెందిందే.ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే వెయిట్ లాస్ తో సహా అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
అందుకోసం ముందుగా రెండు ఆరెంజ్ పండ్లను( Oranges ) తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు యాపిల్ ముక్కలు,( Apple ) అర కప్పు పీల్ తొలగించి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు,( Carrot ) వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, ఒక కప్పు అరెంజ్ జ్యూస్ మరియు అర గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
ఆపై స్ట్రైనర్ సాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకుని సేవించడమే.
ఈ ఆపిల్ క్యారెట్ ఆరెంజ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఈ జ్యూస్ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా నిండి ఉంటాయి.వారానికి కనీసం రెండుసార్లు ఈ జ్యూస్ ను తాగితే బోలెడు లాభాలు పొందుతారు.
ముఖ్యంగా ఆపిల్, క్యారెట్, ఆరెంజ్ కలయిక శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.దినచర్యలో జీవశక్తిని పెంచుతుంది.
చర్మానికి కొత్త కాంతిని జోడిస్తుంది.
తక్కువ కేలరీలు మరియు అధిక ఫైబర్ ఉండటం ఉండటం వల్ల ఈ జ్యూస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.ఆరెంజ్ లో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచి.
జలుబు, ఫ్లూ వంటి అనారోగ్యాల నుండి రక్షణ కల్పిస్తుంది.క్యారెట్ లో ఉండే విటమిన్ వి కంటి ఆరోగ్యం మెరుగుపరిచేందుకు, వివిధ దృష్టి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
యాపిల్ లోని పోషకాలు రక్తపోటు నియంత్రించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.అలాగే ఆపిల్, క్యారెట్, ఆరెంజ్ కలయికతో జ్యూస్ తయారు చేసుకుని తాగడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరంలో పేరుకుపోయిన మలినాలు సైతం బయటకు తొలగిపోతాయి.