అల్లు అర్జున్( Allu Arjun ) బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.నిన్న రాత్రి ఈయనకు బెయిల్ మంజూరు అయినప్పటికీ రాత్రంతా చంచల్ గూడా జైలులోనే ఈయనని ఉంచి నేడు ఉదయం ఆరు గంటలకు జైలు నుంచి బయటకు విడుదల చేశారు.
దీంతో పెద్ద ఎత్తున జైలు వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.బెయిలు మంజూరు అయినప్పటికీ ఎందుకు అల్లు అర్జున్ విడుదల( Allu Arjun Released ) చేయలేదంటూ అభిమానులు కంగారు వ్యక్తం చేస్తూ జైలు గేటు వద్దనే కాపుకాసారు.
జైలు( Jail ) బయట అభిమానులు భారీ స్థాయిలో వచ్చి ఉండటంతో ఈ సమయంలో అల్లు అర్జున్ బయటకు వెళ్తే పరిస్థితి మరింత ఉద్రిక్తం అవుతుందని భావించిన అధికారులు అల్లు అర్జున్ నేడు ఉదయం 6 గంటలకు జైలు వెనుక గేటు నుంచి విడుదల చేశారు.ఇలా జైలు నుంచి బయటకు వచ్చిన ఈయన నేరుగా గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఇంటికి వెళ్లారు.
ఇలా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లగానే ఒక్కసారిగా తన భార్య పిల్లలను చూసి ఎమోషనల్ అవుతూ వారిని హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు స్నేహ రెడ్డి( Sneha Reddy ) మాత్రం తన భర్తను చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇక అల్లు అర్జున్ ఇంటికి రాగానే మీడియాతో మాట్లాడారు.ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కనుక నేను ఈ విషయం గురించి ఏం మాట్లాడలేనని తెలిపారు.అయితే సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ ఘటన దురదృష్టకరమని తెలిపారు.
రేవతి అనే అభిమానీ మరణం బాధాకరం వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా అండగా ఉంటానని ఈయన మాట ఇచ్చారు.
తన అరెస్టు పట్ల తనకు మద్దతు తెలిపిన వారందరికీ కూడా ఈయన కృతజ్ఞతలు తెలియజేశారు.ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు.నేను చట్టాన్ని గౌరవిస్తాను.
నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు.రేవతి కుటుంబానికి నా సానుభూతి…జరిగిన ఘటన దురదృష్టకరం.
ఇది అనుకోకుండా జరిగిన ఘటన.అభిమానాలు ఆందోళన చెందాల్సిన పనిలేదనీ తెలిపారు.