యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం వెల్లంకి-గుండ్రాంపల్లి వెళ్లే రహదారి సమస్య గురించి అనేకసార్లు పార్టీలకు అతీతంగా అఖిలపక్ష పార్టీల అధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, వంటావార్పులు నిర్వహించారు.అయినా పాలకుల్లో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.2003 లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు వేశారు.ఇప్పటికీ 21 ఏళ్లు దాటినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఈ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.
గత సంవత్సరం తెలుగుదేశం,జనసేన, బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో పాదయాత్ర చేసినా,తర్వాత సిపిఎం పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టినా మిగతా పార్టీ వాళ్లు కూడా పలు రకాలుగా ఈ రోడ్డు సంబంధించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.నాయకులు చాలాసార్లు అధికారుల దృష్టికి కూడా ఈ సమస్య తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు.
ఈ నియోజకవర్గంలో ఇప్పటికి ఐదుగురు ఎమ్మెల్యేలు మారినా ఈ రోడ్డు మీద ఎలాంటి దృష్టి సారించలేదని,ఈ రోడ్డు మీద ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించి రోడ్డుకు టెండర్లు వేసి త్వరగా నూతన రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.