రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కిష్టరావుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండలంలోని పరిదా తండాకు చెందిన లంబాడి శ్రీనివాస్ ఉద్యోగ రీత్యా రాజన్నా సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కిష్టరావుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా రావడం జరిగింది ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా మున్సిపల్ సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ గా ఎంపిక కావడం జరిగింది .అ ఉద్యోగంలో జాయిన్ అయ్యే క్రమంలో ఎన్ఓసి సర్టిఫికెట్ కొరకు ఎంపిఓ ని కోరగా ఆయన దుర్భషాలాడడం జరిగింది.
గతంలో కూడా తనను హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి దీంతో మనస్థాపం చెందిన శ్రీనివాస్ తన వెంట తెచ్చుకున్న క్రీమిసంహారక మందు తాగి ఆత్మ హత్యయత్నానికి పాల్పడ్డాడు.ఇది గమనించిన తోటి కార్యదర్శులు వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.