టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్యకు( Balayya ) కోపం ఎక్కువని ఎప్పుడూ సీరియస్ గా ఉంటారని చాలామంది భావిస్తారు.అయితే బాలయ్యను దగ్గరినుంచి చూసిన వాళ్లు మాత్రం బాలయ్య మనస్సు బంగారం అని ఆయన రియల్ హీరో( Real Hero ) అని కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స చేయించి బాలయ్య వార్తల్లో నిలిచారు.మరోసారి మంచి మనస్సు చాటుకుని ఈ హీరో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.
ప్రస్తుతం బాబీ( Bobby ) సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య తాజాగా చేసిన పని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.స్టార్ హీరో బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రి( Basavatarakam Hospital ) ద్వారా క్యాన్సర్ పేషెంట్లకు మెరుగైన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే తన వంతు సహాయ సహకారాలు అందించడానికి బాలయ్య ముందు వరుసలో ఉంటారు.ఏపీలోని కడియపులంక( Kadiyapulanka ) గ్రామానికి చెందిన ఒక చిన్నారి ఆరోగ్య సమస్యతో బాధపడుతోందని బాలయ్య దృష్టికి రాగా బాలయ్య వెంటనే స్పందించి తన ఆసుపత్రి ద్వారా ఆ చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూస్తున్నారు.
ఈ విషయంలో బాలయ్యను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
బాలయ్య సినిమాలతో పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన దృష్టికి వచ్చిన ప్రతి చిన్న సమస్యను వేగంగా పరిష్కరిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.హిందూపురం ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు.బాలయ్య ఈ జనరేషన్లో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
బాలయ్య బాబి కాంబో మూవీ నుంచి త్వరలో మరిన్ని క్రేజీ అప్డేట్లు రానున్నాయి.
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకాల్సి ఉంది.బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య కోరుకున్న భారీ విజయాన్ని అందించాలని ఆశిద్దాం.