జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు సిబ్బందికి '' 78'' వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్,జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో “78” వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించి అనంతరం జెండా ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

 Happy 78th Independence Day To The People Of The District, Police Officers And S-TeluguStop.com

జిల్లా ప్రజలకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి పోలీస్ కుటుంబం సభ్యులకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.భారతదేశం మొత్తం ఈరోజు ఆనందంగా జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, మనం ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎందరో మహానుభావులు కష్ట, నష్టాలకు ఓర్చి వారి విలువైన జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరిస్తూ,ఎంతో మంది త్యాగధనుల పుణ్యఫలం, లెక్కలేనని త్యాగాలు అవిశ్రాంత పోరాటాల తర్వాత వలస పాలన విముక్తి తరువాత స్వాతంత్రం సిద్ధించిందని స్వాతంత్రోద్యమం చరిత్ర, మనకు తెలిసిన మహనీయులు కాకుండా ఎంతోమంది ప్రాణ త్యాగం చేయడం జరిగింది వారి గురించి కూడా పిల్లలకు, కుటుంబం సభ్యులకు భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు.

ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన వంతు భాద్యతగా ప్రజాసేవ కొరకు పాటుపడాలని, సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.పోలీస్ అధికారులు సిబ్బంది వారివారి విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి,సర్వర్, ఆర్.ఐ లు, సి.ఐ లు ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube