తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల( Sreeleela ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.
అంతేకాకుండా ఈ సినిమాలో తన అందం డాన్స్ తో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది.ఇకపోతే శ్రీలీల చివరిగా మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ మూవీతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.అయితే స్త్రీలకు అవకాశాలు క్యూ కడుతున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఆమెకు రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి.ఈ వరుస ఫ్లాపుల వల్ల శ్రీలీల కాస్త వెనుకపడింది.అప్పటి వరకు పగలు, రాత్రి అని తేడా లేకుండా, ఆమె ఎప్పుడు టైమ్ ఇస్తే అప్పుడు షూటింగ్ లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది.
ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ శ్రీలీల ఒక సినిమా పూజ కార్యక్రమాలలో పాల్గొంది.ఈ సందర్భంగా ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.ఎందుకంటే మొన్నటి వరకు స్లిమ్ముగా చాలా అందంగా కనిపించిన శ్రీ లీలా తాజాగా షేర్ చేసిన ఫోటోలలో చాలా లావుగా మారిపోయి బొద్దుగా కనిపించింది.22 ఏళ్ల వయసులో నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లలా కనిపించిన శ్రీలీల ఈ పూజ ఫొటోల్లో మాత్రం కాస్త ఎక్కువ వయసున్నట్లు కనిపించింది.దీంతో సోషల్ మీడియాలో అక్కడక్కడ ఆంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.