సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగే హీరోలను ప్రోత్సహించడం సాధారణమైన విషయం కాదు.సినిమా రంగంలో సహయం చేయాలని భావించే వాళ్ల కంటే తొక్కేయాలని భావించే వాళ్లు ఎక్కువమంది ఉంటారు.
అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) మాత్రం టాలెంట్ ఉన్న యంగ్ హీరోలను ప్రోత్సహించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.తారక్ కు ఎవరూ సాటిరారంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకవైపు విశ్వక్ సేన్( Vishwak Sen ) మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ హీరోలకు జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఆయా హీరోల సినిమాల ఈవెంట్లకు హాజరై ఆ సినిమాల స్థాయిని పెంచడంలో ఎన్టీఆర్ ముందువరసలో ఉంటున్నారు.
ఇతర హీరోలకు భిన్నంగా తారక్ వ్యవహరిస్తున్నారు.
యంగ్ హీరోలకు( Young Heroes ) స్టార్స్ నుంచి సపోర్ట్ వస్తే ఆ హీరోలు సైతం మానసికంగా మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు ఇతర చిన్న హీరోల సినిమాల ఈవెంట్లకు హాజరైనా మొక్కుబడిగా మాట్లాడుతున్నారే తప్ప ఆ హీరోలను పూర్తిస్థాయిలో సపోర్ట్ చేసే విషయంలొ మాత్రం ఫెయిల్ అవుతున్నారనే చెప్పాలి.ఎన్టీఆర్ దేవర సినిమాకు( Devara Movie ) సంబంధించి కూడా షాకింగ్ అప్ డేట్స్ ఇచ్చారు.
దేవర సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా తొలి భాగం ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది.ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుందని ఎన్టీఆర్ చెబుతుండగా తారక్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ యంగ్ హీరోలను సపోర్ట్ చేస్తున్న తీరును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.