ఈ మూడు నెలలూ అగ్నిగుండమే ఐఎండీ హెచ్చరిక...!

నల్లగొండ జిల్లా:దేశంలో ఏప్రిల్‌, మే,జూన్‌ మూడు నెలల పాటు భానుడి విశ్వ రూపంతో తీవ్రమైన వేడి గాలులతో ఎండలు మండిపోతూ విపరీతమైన వేడి వాతావరణం నెలకొని అగ్నిగుండాన్ని తలపిస్తోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది.మధ్య,పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది.

 Imd Alert Summer Heat Waves Next Three Months, Imd ,summer Heat Waves , Weather,-TeluguStop.com

ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని,మధ్య,పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు.

ఈశాన్య రాష్ట్రాలు,పశ్చిమ హిమాలయ ప్రాంతం,ఒడిశా ఉత్తర భాగంలో సాధారణం నుంచి సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు.

అదేసమయంలో మైదాన ప్రాంతంలో వేడి గాలులు వీచే రోజులు పెరిగే అవకాశం ఉందన్నారు.సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులు వేడి గాలులు వీచేవని,ఈ సారి పది నుంచి 20 రోజుల పాటు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర,ఉత్తర కర్ణాటక,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,ఒడిశా,ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుందని మహాపాత్ర చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube