కాళేశ్వరం , మేడిగడ్డ, సుందిళ్ళ ప్రాజెక్టులను నాణ్యత లోపం వల్లే కరువు.కేటీఆర్ అసమార్థత మూలంగానే మల్కాపేట తొమ్మిదవ ప్యాకేజీ పనులు పూర్తికాలేదు.
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బిఆర్ఎస్ పార్టీ ని సమర్ధించే పరిస్థితుల్లో గాని హార్శించే పరిస్థితుల్లో గాని తెలంగాణ ప్రజలు లేరని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోమ్మాటీ నరసయ్య మాట్లాడుతూ కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ రావు మాటలు ఆస్యస్పదమని ఆయన తీవ్రంగా ఖండించారు.
బిఆర్ ఎస్ పార్టీ ఎంపీగా ఇక్కడ ఆయన చేసినటువంటి అబివృద్ధి పనులు ఏమీ లేవన్నారు.బిఆర్ ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తకు కూడా వినోద్ రావు పేరు చేరలేదంటే ఎంత సమర్థవంతంగా పనిచేసిండో మీకే అర్థమవుతుందని అన్నారు.
గతంలో వీర్నపళ్లి మండలాన్ని దత్తత తీసుకొని ఆయన అక్కడ ఏమి అభివృద్ధి చేసిండో వీర్న పల్లి మండల ప్రజలను అడిగినట్లయితే వారు స్వయంగా ఏంచేసిండో చెప్తారన్నారు అదేవిధంగా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లో ఆయన ఎంపీగా చేసిన పనులు శూన్యం అన్నారు.బిఆర్ ఎస్ పార్టీ కి చెందిన సామాన్య కార్యకర్త ఆయన దగ్గరకు పని ఉందని పోతే పని చేయకపోగా జిల్లా అధ్యక్షుని అడిగి వచ్చావా ఆయన అనుమతి తీసుకున్నావా అని మాట్లాడేవాడిని కార్యకర్తలే బహాటంగా అసంతృప్తితో ఆవేదనతో చెబుతున్నారని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ వస్తేనే కరువు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ వస్తేనే పంటలు దెబ్బతిన్నాయని ఎన్నో రకాల విమర్శలు కాంగ్రెస్ పార్టీ పై వారు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిందని , వర్ష కాలం అనేది జూన్ నెలలో ప్రారంభమవుతుందనే ఇంగిత జ్ఞానం కూడా బిఆర్ ఎస్ పార్టీ నాయకులకు ఎంపీ వినోద్ రావుకు లేదన్నారు.వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురవాలని పాడిపంట పిల్లా జెల్లా సల్లంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నారు.
కాలేశ్వరం,సుందిళ్ళ మేడిగడ్డ ప్రాజెక్టుల ను నాణ్యత లోపంతో నిర్మించడం మూలంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్లే కరువు ఏర్పడిందని ఆయన విమర్శించారు.అదేవిధంగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అసమర్థత వల్ల మల్కాపేట తొమ్మిదవ కాలువ ప్యాకేజీ పనులు ఇంకా పూర్తి చేయకపోవడం వల్ల సింగసముద్రంలోకి నీళ్లు రాలేని పరిస్థితి ఏర్పడదన్నారు.
ఈ ప్రాంతంలో కరువుకు కారణం మీరై మాపైన ఆ బండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గుండాడి రామ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , గంట బుచ్చా గౌడ్ , సిరిపురం మహేందర్, నరేందర్ , ద్యాప దేవయ్య , మద్దుల శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు