టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు అడుగుపెట్టారు కానీ వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు.ఈ తరం సక్సెస్ ఫుల్ దర్శకులను చూసుకుంటే రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, సుకుమార్, కొరటాల శివ, క్రిష్, సందీప్ రెడ్డి వంగా వంటి వారు గుర్తొస్తారు.
వీరిలో పూరి జగన్నాథ్( Puri Jagannadh ) ప్రత్యేకంగా నిలుస్తాడని చెప్పుకోవచ్చు.ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, పోకిరి, బిజినెస్‌మేన్, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే ఈ విజయాలను అందుకోవడానికి ముందు ఈ డైరెక్టర్ రియల్ లైఫ్‌లో చాలానే కష్టాలు పడ్డాడు.
మానసికంగా, శారీరకంగా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా అతడు ముందుకే కొనసాగాడు తప్పితే వెనకడుగు వేయలేదు.ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అతడు ఒక పెద్ద పోరాటమే చేశాడు.ఎక్కడ పడిపోయానే అక్కడే మళ్ళీ నిలబడి చూపించాలి అనే కసి పూరి జగన్నాథ్ లో ఎక్కువ.
అందుకే చాలామంది హీరోలు, దర్శకులు పూరికి పెద్ద అభిమానులు అయిపోయారు.మొండి పట్టుదలతో ముందడుగు వేసే ఈ దర్శకుడిని చూసి చాలామంది కొత్త దర్శకులు ఇండస్ట్రీలో అడుగు పెట్టారంటే అతిశయోక్తి కాదు.
అయితే ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఇండస్ట్రీలో చాలా ఒదిగి ఉంటాడు పూరి జగన్నాథ్.అతనిలోని ఈ మంచి లక్షణాలు దిగ్గజ దర్శకుడు రాజమౌళికి( Rajamouli ) బాగా నచ్చేసాయి.
అందుకే ఈ దర్శకుడికి రాజమౌళి కూడా పెద్ద అభిమాని అయ్యాడని అంటారు.వి.వి వినాయక్‌కి( VV Vinayak ) కూడా పూరీ జగన్నాథ్ అంటే బాగా ఇష్టం.
పూరి జగన్నాథ్ ఎలాంటి ప్రాబ్లం అయినా తన మైండ్ దాకా తెచ్చుకోడు.వాటిని ప్రశాంతంగా సాల్వ్ చేయడానికి ఇష్టపడతాడు.ఆ లక్షణం కూడా చాలామందికి నచ్చుతుందని అంటారు.
చాలా జోవియల్ గా ఉండే ఈ పూరి అంటే హీరోలకు కూడా చచ్చేంత ఇష్టం.పూరి లైగర్ సినిమా( Liger Movie ) వల్ల చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు.
ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి డిజాస్టర్ అయ్యింది.ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా( Double Ismart Movie ) చేస్తున్నాడు.
అది ఈ సంవత్సరం జూన్ 14న రిలీజ్ కానుంది.మూవీ హిట్ అయితే మళ్లీ పూరి జగన్నాథ్ కెరీర్ గాడిలో పడుతుంది.
ఈ మూవీపై కూడా హైప్స్ ఎక్కువగానే ఉన్నాయి.కాబట్టి రిలీజ్ చేసే ముందు అన్ని సరిచూసుకొని హిట్టు కొట్టేలాగా ప్లాన్ చేసుకోవడం మంచిది.